వారసత్వం విఫలమైంది..! పార్టీ ముక్కలవుతోంది..!

రాజకీయ పార్టీని నడిపించడమంటే ఆషా మాషీ కాదు. ఎన్నో యుక్తులు, కుయుక్తులు తెలిసి ఉండాలి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి. కొందరు రాజకీయ నాయకులు తాము బతికి ఉండగానే వారసత్వాన్ని రంగంలోకి దింపి తమ పార్టీ మనుగడను కాపాడుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల వారసుడు రాజకీయాల్లోకి రాకముందే వ్యవస్థాపకుడు మరణిస్తే ఆ పార్టీ ఛిన్నాభిన్నమవుతుందని లోక్ జనశక్తి పార్టీ గురించి తెలిస్తే అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్న కీలకంగా ఉండే లోక్ […]

Written By: NARESH, Updated On : June 25, 2021 10:04 am
Follow us on

రాజకీయ పార్టీని నడిపించడమంటే ఆషా మాషీ కాదు. ఎన్నో యుక్తులు, కుయుక్తులు తెలిసి ఉండాలి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి. కొందరు రాజకీయ నాయకులు తాము బతికి ఉండగానే వారసత్వాన్ని రంగంలోకి దింపి తమ పార్టీ మనుగడను కాపాడుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల వారసుడు రాజకీయాల్లోకి రాకముందే వ్యవస్థాపకుడు మరణిస్తే ఆ పార్టీ ఛిన్నాభిన్నమవుతుందని లోక్ జనశక్తి పార్టీ గురించి తెలిస్తే అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్న కీలకంగా ఉండే లోక్ జనశక్తి పార్టీని నడిపే వారసుడు విఫలమయ్యాడని చర్చించుకుంటున్నారు. దీంతో పార్టీ ముక్కలవుతుందని అంటున్నారు..

బీహార్ లోని లోక్ జనశక్తి పార్టీని రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించాడు. కేంద్రంలో కాంగ్రెస్, ఎన్డీయే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రామ్ విలాస్ కేంద్ర మంత్రిగా కొనసాగేవారు. అయితే దురదృష్టవ శాత్తూ గత కొన్ని నెలల కిందట అనారోగ్యంతో మరణించాడు. దీంతో పార్టీ పగ్గాలను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ చెపట్టాడు. అయితే తండ్రి సూచనలను కొరవడిని చిరాగ్ పార్టీని సరైన మార్గంలో నడిపించలేకపోయాడు. దీంతో గత సంవత్సరం బీహార్లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఎన్టీయేకు మద్దతు ఇవ్వలేక.. నితీశ్ కుమార్ తో విభేదాలు తెచ్చుకొని ఎటూ కాకుండా పోయారు.

లోక్ జనశక్తి పార్టీకి 5గురు ఎంపీలున్నారు. ఇటీవల ఆన బాబాయ్ తో విభేదాల కారణంగా.. ఆయన వేసిన ఎత్తులకు చిరాక్ తట్టుకోలేకపోయాడు. దీంతో 5గురు ఎంపీలతో వేరు కుంపటి పెట్టిన చిరాగ్ బాబాయ్ పార్టీ తమదేనంటున్నారు. ఇలా రాజకీయ దూకుడుకు చిరాగ్ తట్టుకోలేకపోతున్నారు. అయితే చిరాగ్ తండ్రి ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పార్టీ పరిస్థితి తెలుసుకునేవారని కొందరు అంటున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో సంయమనంతో పాటు కలగొలుపుతనం అవసరమని, విభేదాలతో పార్టీ మనుగడ సాధించదని చర్చించుకుంటున్నారు.

ఇక తండ్రులు లేకపోయినా వారసత్వాన్ని తీసుకున్న కుమారుడు పార్టీని విజయవంతంగా తీసుకెళ్లిన వారున్నారు. ఇదే రాష్ట్రంలోని ఆర్జేజీడిని లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు ఎక్కువ సీట్లను తీసుకురాగలిగారు. అటు తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే కుమారుడు స్టాలిన్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగాడు. అయితే ఎల్జీపీ వారసుడు చిరాగ్ పాశ్వాన్ మాత్రం విఫలమయ్యారని రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.