
China News: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో తన శక్తియుక్తుల్ని ధార పోశారు. ఈ నేపథ్యంలో చైనా అభివృద్ధిలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. జీవితంలో కీలక ఘట్టాలను ఆవిష్కరించి నూతన పథంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ దేశాలకు దీటైన జవాబు ఇస్తున్నారు.
దేశంలో అత్యధిక కాలం ఇంటికే పరిమితమైన నేతగా జిన్ పింగ్ రికార్డు సాధించారు. ఇంతకు ముందు దేశాధినేతగా ఉన్న నేత ఎవరు కూడా ఇన్నాళ్లు ఇంటికి పరిమితం కాలేదు. జిన్ పింగ్ చివరి సారిగా 2020 జనవరి 18న మయన్మార్ లో పర్యటించారు. తరువాత మార్చిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను తమ స్వదేశంలోనే కలుసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దేశాధినేతను కూడా కలవకుండా స్వదేశానికే పరిమితమైపోయారు.
కొవిడ్ పుట్టుకకు కారణమైన చైనా(China News)పై అన్ని దేశాల్లో విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఆయన ఏ దేశానికి వెళ్లకుండా ఉన్నారని ఓ వాదన వస్తున్నా వేరే కారణాలు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. జిన్ పింగ్ పాలనపై చైనా ప్రజలకు విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. తన పాలనలో ప్రజల సమస్యలు తీర్చడంలో జిన్ పింగ్ ప్రత్యేకమైన శైలిగా తెలుస్తోంది.
జిన్ పింగ్ అధికారంలోకి రాగానే టైగర్స్ అండ్ ఫ్లైస్ జరిగిన తతంగంలో దాదాపు మూడు లక్షల మందిని జైల్లో పెట్టారు. జిన్ పింగ్ ను వ్యతిరేకించినందుకుగాను రియల్ ఎస్టేట్ వ్యాపారి రెన్ జియాక్వింగ్ 18 ఏళ్లు జైలు శిక్షకు గురయ్యాడు. కొవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం చైనా వైపు చూస్తుందని తెలుస్తోంది.
Also Read: చైనాలో ఆహార సంక్షోభం ఎందుకు..?