Sree Mukhi: బుల్లి తెర లో యాంకర్లకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వెండితెర పై హీరోయిన్లకి ఉన్నంత క్రేజ్ బుల్లి తెరలో యాంకర్లకి ఉంటుంది. అంత గుర్తింపు తెచ్చుకున్నయాంకర్లలలో ఒకరు శ్రీ ముఖి. ముందు సినిమాలు చేస్తూ వెండి తెర పైకి ఎంట్రీ ఇచ్చి మెరిసింది శ్రీ ముఖి. ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో బుల్లి తెర కి వచ్చి సెటిల్ అయ్యింది శ్రీ ముఖి. అయితే ఈ అమ్మడు ఒక వైపు సోషల్ మీడియాలో మరోవైపు టీవీ షోస్ తో తెగ సందడి చేస్తుంది.
అయితే ఆహా లో ప్రసారమవుతున్న “సర్కార్” అనే గేమ్ షో లో పాల్గొంది శ్రీ ముఖి. దానికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో విడుదల అయ్యి హల్చల్ చేస్తుంది. ఈ గేమ్ షో కి ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. రీసెంట్ గా ప్రారంభమయిన ఈ షో కి బుల్లితెర, వెండి తెర కి సంబంధించిన సెలబ్రిటీస్ పాల్గునంటున్నారు.
ఈ షో కి యాంకర్ శ్రీముఖి తో పాటు కామెడీ కింగ్ అలీ, ప్రవీణ్, మధు పాల్గున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోని బట్టి చూస్తుంటే తెలిసిపోతుంది. గేమ్ షో లో కి ఎంటరవ్వగానే శ్రీ ముఖి మాట్లాడుతూ తగ్గేదేలే అని డైలాగ్ వెయ్యగా, యాంకర్ ప్రదీప్ శ్రీ ముఖి యొక్క శరీరాకృతి ని బేస్ చేసుకుని తగ్గేదేలే అంటూ ఆట పట్టించాడు. ఈ క్రమం లో యాంకర్ శ్రీ ముఖి అలీ తో మాట్లాడుతూ … సార్ మీరు నాకు దగ్గర ఉండి పెళ్లి చెయ్యాలి అని కోరగా… అలీ షాకయ్యాడు.