China’s artificial sun: సూర్యుడు.. మన భూమి, ఇక్కడి జీవజాలం బతుకుతుందుంటే అంతా ఆయన చలవే. ఆ ఎండ వేడిమియే మొక్కలు, తద్వారా జీవులను బతికిస్తుంది. సూర్యుడు లేకుంటే అసలు ఆహారమే లేదు. జీవుల మనుగడనే భూమి మీద ఉండేది కాదు. అయితే సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి ఈ చైనావాళ్లు ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా లాంటి జీవులను పుట్టించి ప్రపంచ వినాశనానికి కేంద్రబిందువులైన చైనా వాసులు తాజాగా కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్నారు.

చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు డిసెంబర్ 30న కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఇది 1056 సెకన్ల పాటు 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసింది. ఇలా 17 నిమిషాల పాటు ఉత్పత్తి కొనసాగింది.
2021 ప్రథమార్థంలో జరిపిన ప్రయోగంలో 101 సెకన్ల పాటు 120 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పుట్టించారు. తాజాగా మరో రికార్డును బద్దలు కొట్టారు.
నీటిలో సంవృద్ధిగా ఉండే డ్యూటెరియంను ఉపయోగించి సూర్యుడి వలే అణు కలయిను ప్రేరేపించడం ద్వారా ఈ స్వచ్ఛమైన శక్తిని నిరంతరం ఉత్పత్తి చేసి సరఫరా చేయవచ్చని చైనా శాస్త్రవేత్తలు నిరూపించారు.
ఈ ప్రయోగంలో భాగంగా న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ భారీ హైడ్రోజన్ పరమాణువులను ఢీకొట్టి హీలియంను ఉత్పత్తి చేస్తుంది. భారీ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. ఇది మన సూర్యుడి వంటి నక్షత్రాలలో సహజంగా జరిగే ప్రక్రియ.. దాన్ని చైనా శాస్త్రవేత్తలు కృత్రిమంగా రూపొందించి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు.
బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలు వేగంగా క్షీణించి పర్యవరణానికి హాని కలిగిస్తున్నాయి. కానీ చైనా ‘కృత్రిమ సూర్యుడు’ కోసం అవసరమైన ముడి మూలకాలు భూమిపై అపరిమితంగా ఉంటాయి. ఫలితంగా ఈ ఫ్యూజన్ ఎనర్జీ అనేది మానవాళి భవిష్యత్తుకు అంతిమశక్తి అని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.