Dasari Narayana Rao: తెలుగు సినిమాకి ఒక మేరుపర్వతం లాంటి అగ్ర దర్శకుడు ఆయన, అగ్ర నిర్మాత ఆయన, మరియు వైవిధ్యమైన నటుడు కూడా ఆయన. ఆయనే దాసరి నారాయణరావు. ఆ మహా దర్శకుడిని అవమానించిన సంఘటన ఇది. ఏభై ఐదేళ్ల క్రితం మాట ఇది. తెలుగులో అప్పుడు కుటుంబ మరియు ప్రేమకథా చిత్రాలు పెరుగుతున్న కాలం అది.

దాసరి గారు అప్పట్లో నాటకాలు వేసేవారు. అలా ఆయన వేసిన ఓ నాటకం చూసి.. మీకు మా సినిమాలో అవకాశం ఇస్తాం రండి’ అని మద్రాసు తీసుకువెళ్లారు. అలా మొదట సినిమాలో నటుడిగా ప్రవేశించిన దాసరికి అవమానం జరిగింది. దాసరి నారాయణ రావుకు మేకప్ వేయడానికి ఒక మేకప్ మెన్ వచ్చాడు. దాసరిని చూసి నిట్టూరుస్తూ.. ‘ఏమిటయ్యా నువ్వు కూడా నటిస్తావా ?’ అంటూ హేళనగా చూశాడు.
దానికి తోడు మేకప్ కూడా సరిగా వేయకుండా చిరాకు పడుతూ.. ‘నీ ఫేస్ కి యాక్టింగ్ కావాలా ? అసలు ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నావా ?’ అంటూ దారుణంగా అవమానించాడు. అప్పటి నుంచి దాసరి సినిమాల్లో నటుడిగా ప్రయత్నాలు చేయడం ఆపేసి.. మాటల రచయితగా తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి వరుస సక్సెస్ లు అందుకున్నారు.
Also Read: ఎన్టీఆర్ ‘కర్ణ’కి 15 రెట్లు లాభాలు.. నేటికీ ఇది గొప్ప రికార్డే !
అయితే, స్వర్గం నరకం అనే సినిమాలో ఆచార్య అనే పాత్ర ఒకటి ఉంది. సినిమాకు అది చాలా ప్రత్యేకం కూడా. ఆ పాత్రకు సరైన నటులు దొరకలేదు. దాసరి గారు ఈ పాత్ర వేయాలని సూచిస్తున్నారు అందరూ. కానీ దాసరికి మాత్రం ఆ మేకప్ మెన్ అన్న మాటలు ఇంకా మనసులోనే ఉన్నాయి. నటించాలనే కోరిక ఉన్నా.. ఆ మేకప్ మెన్ మాటలు గుర్తుకు వచ్చి నటించకూడదు అని నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఆ తర్వాత ఓ రోజు అనుకోకుండా దాసరి ఎన్టీఆర్ గారిని కలిశారు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ మాటల మధ్యలో ‘మీలో నటుడున్నాడు బ్రదర్’ అంటూ ఎన్టీఆర్ చెప్పారట. అప్పుడు మళ్ళీ దాసరికి నటించాలి అని కోరిక కలిగింది. ఆ రోజే మళ్ళీ నటించాలి అని నిర్ణయం తీసుకుని స్వర్గం నరకం సినిమాలో ఆచార్య పాత్రలో నటించారు.