Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: లండన్ లో ప్రియుడితో డేటింగ్ చేస్తున్న రకుల్...

Rakul Preet Singh: లండన్ లో ప్రియుడితో డేటింగ్ చేస్తున్న రకుల్ !

Rakul Preet Singh: ర‌కుల్ ప్రీత్ సింగ్ యంగ్ హీరో జాకీ భగ్నానీతో ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. ఆ మధ్య వీరిద్దరూ తమ ప్రేమ గురించి ప్రపంచానికి సోషల్ మీడియా వేదికగా చాటి చెప్పారు. అయితే, తాజాగా ఈ జంట లండ‌న్ వెళ్లింది. తమ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను అక్కడే ఘనంగా జరుపుకుని ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోవడానికి అక్కడే పది రోజులు పాటు డేటింగ్ చేశారు.

Rakul Preet Singh
Rakul Preet Singh with her boy friend

అసలు ఒక స్టార్ హీరోయిన్ ప్రేమిస్తోంది అంటే… ఆ వ్యక్తి బ్యాక్ గ్రౌండ్, బ్యాక్ ప్రాపర్టీస్ చూసుకునే ప్రేమిస్తోంది. పైగా ‘రకుల్ ప్రీత్ సింగ్’ లాంటి పక్కా కమర్షియల్ హీరోయిన్ ప్రేమలో పడింది అంటే.. అతను కచ్చితంగా ఆమె కంటే స్థాయిలో స్తోమత లో ఉన్నతమైన వ్యక్తే అయి ఉంటాడు. ఇంతకీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రేమిస్తోన్న జాకీ భగ్నానీ ఎవరో తెలుసా ?

బాలీవుడ్‌ లోనే ఓ దశలో టాప్ నిర్మాతగా కొనసాగిన ‘వశు భగ్నానీ’ తనయుడే ఈ ‘జాకీ భగ్నానీ’. స్వస్థలం కోల్‌కతా, జాకీ భగ్నానీ న్యూయార్క్‌ లోని ‘లీ స్ట్రాస్‌ బర్గ్‌ థియేటర్‌ అండ్‌ ది ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో తన ఉన్నత విద్యతో పాటు అక్కడే యాక్టింగ్‌ కోర్సు ను కూడా పూర్తి చేశాడు. మొదటి సినిమాతోనే బాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరాలని చాలా ప్రయత్నాలే చేశాడు.

కానీ కాలం కలిసి రాలేదు, అంగబలం, ఆర్థిక బలం ఉన్నా.. అతన్ని అవేవీ స్టార్ ను చేయలేకపోయాయి. దాంతో ‘రెహ్నా హై తేరే దిల్‌ మే‌’ అనే సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఆ తర్వాత దాదాపు నలభై కథలు విని ‘కల్‌ కిస్నే దేఖా’ అనే సినిమాతో హీరోగా హిందీ తెరకు పరిచయమయ్యాడు. ఐతే, ఆ సినిమా అతని పరువు తీసింది. ఆ రేంజ్ లో డ్యామేజ్ అయింది ఆ సినిమా.

Also Read: నీ ఫేస్ కి యాక్టింగ్ కావాలా ?.. ఎన్టీఆర్ వల్లే ఆ కోరిక కలిగింది !

ఆ తరవాత ‘ఫాల్తు’, ‘అజబ్‌ గజబ్‌ లవ్‌’, ‘యంగిస్థాన్‌’, ‘వెల్‌కమ్‌ టు కరాచీ’ లాంటి సినిమాలు చేసినా.. ‘జాకీ భగ్నానీ’ కి స్టార్ డమ్ మాత్రం రాలేదు. కనీసం హీరోగా కూడా గుర్తింపు రాలేదు. దాంతో కోలీవుడ్‌ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ‘మెహిని’ అనే సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే.. అక్కడ పాప్ కార్న్ డబ్బులు కూడా తిరిగి రాలేదు.

దాంతో ‘జాకీ భగ్నానీ’ నిర్మాతగా కూడా మారాడు. ‘సర్జ్బిత్‌’, ‘దిల్‌ జంగ్లీ’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘కూలీ నం. 1’, ‘బెల్‌ బాటమ్‌’ లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అయితే నిర్మాతగా కూడా ‘జాకీ భగ్నానీ’ సక్సెస్ కాలేదు. ముఖ్యంగా ‘బెల్‌ బాటమ్‌’ సినిమాకి దాదాపు 70 కోట్లు నష్టాలు వచ్చాయి. మొత్తానికి హీరోగా నిర్మాతగా సంపూర్ణంగా ఫెయిల్ అయిన ‘జాకీ భగ్నానీ’ రకుల్ ప్రేమను మాత్రం గెలుచుకున్నాడు.

Also Read: ఛాన్స్ ల కోసం లేటు వయసులో హీరోయిన్ తాపత్రయం !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular