China supports India: హల్గాం దాడి జరిగిన రెండు నెలల తర్వాత చైనా ఖండన.. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. మంత పేరు అడుగుతూ 26 మందిని కాల్చి చంపేశారు. ఈ ఘటన యావత్ భారత్‌తోపాటు ప్రపంచంలో అనేక దేశాలు కండించాయి. భారత్‌కు బాసటగా నిలిచాయి. అయితే ఈ ఘటనపై చైనా మాత్రం ఏమీ మాట్లాడలేదు. పైగా పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టన ఆపరేషన్ సిందూర్‌ను ప్రతిఘటించేందుకు పాకిస్తాన్ చేసిన దాడులకు సహాయం అందించింది. ఆయుధాలు సరఫరా చేసింది. అయితే ఘటన జరిగిన రెండు నెలల తర్వాత తాజాగా డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడు పహల్గాం దాడిని ఖండించింది. జైష్–ఏ– మహ్మద్ అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్‌ఎఫ్)ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన మూడు రోజుల తర్వాత చైనా తాజాగా పహల్గాం దాడిపై స్పందించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. చైనా వైఖరిలో ఆకస్మిక మార్పు చర్చనీయాంశమైంది. ఎందుకంటే భారత్ దీర్ఘకాలంగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్), పీపుల్స్ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్‌ఎఫ్)ను నిషేధించాలని ఐక్యరాజ్యసమితి 1267 కమిటీలో కోరుతోంది. గతంలో చైనా తన వీటో శక్తిని ఉపయోగించి ఈ సంస్థలకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడిని ఖండించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడటం గమనార్హం. ఈ మార్పుకు కారణం భారత్‌తో స్నేహబంధం బలోపేతం చేసుకోవాలన్న చైనా ఆకస్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా టీఆర్‌ఎస్.. అమెరికా సంచలన ప్రకటన!
అమెరికా అనుకూల వైఖరే కారణమా?
పాకిస్తాన్ చాలాకాలంగా ఇటు అమెరికాతోనూ.. అటు చైనాతోనూ దోస్తీ నటిస్తూ.. రెండు దేశాలను దోచుకుంటోంది. అవసరమైన సహకారం పొందుతోంది. ఇందుకు అమెరికాకు చైనాను బూచిగా చూపుతోంది.. చైనాకు అమెరికాను బూచిగా చూపుతోంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన చైనా.. తాజాగా పాకిస్తాన్‌ను దూరం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే భారత్‌కు దగ్గర కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
రష్యా–భారత్–చైనా కూటమి లక్ష్యంగా…
చైనా, రష్యా, భారత్‌లతో కూడిన ఒక కూటమిని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా అధ్యక్షుడితో జరిపిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇదే సమయంలో, రష్యా నుంచి చమురు కొనుగోలును అమెరికా వ్యతిరేకిస్తూ ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది. అయితే, సముద్ర మార్గంలో చమురు సరఫరా కొనసాగుతుండటంతో ఈ ఆంక్షల ప్రభావం పరిమితంగా ఉండవచ్చు.
Also Read: ఒబామాను ట్రంప్ అరెస్ట్ చేయించబోతున్నారా?
నిషేధం మాత్రమే సరిపోదు..
ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ఒక్కటే సరిపోదు. ఇది జైష్–ఎ–మహ్మద్‌కు ముసుగు సంస్థగా పనిచేస్తుందని భావిస్తున్న నేపథ్యంలో, మసూద్ అజర్‌ను భారత్‌కు అప్పగించేలా పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత అమెరికా, చైనాపై ఉంది. జైష్–ఎ–మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్‌లో లేడని ఆ దేశం పదేపదే చెప్పినప్పటికీ, భారత నిఘా వర్గాలు అతడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని స్కార్దు సమీపంలోని సాత్‌పారాలో ఉన్నట్లు గుర్తించాయి. పుల్వామా, పఠాన్‌కోట్, మరియు 2002 పార్లమెంట్ దాడులకు సూత్రధారిగా ఉన్న మసూద్‌ను అప్పగించే బాధ్యత పాకిస్తాన్‌పై ఉంది. ఈ విషయంలో అమెరికా, చైనాలు పాకిస్తాన్‌పై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.