Coronavirus: కరోనా వ్యవహారంలో చైనా పాత్ర మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. ఎన్ని సర్వేలు చేసినా కొవిడ్ వైరస్ పుట్టుక మాత్రం చైనాలోనే అనే సంగతి అందరికి తెలిసిందే. అయినా చైనా మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. పైగా అమెరికానే వైరస్ ను వ్యాప్తి చేసిందని బుకాయిస్తూ తప్పించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ 2.0 అనే సంస్థ నిర్వహించిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సైబర్ సెక్యూరిటీ సంస్థ డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇంటెలిజన్స్ అనాలసిస్ లో అందెవేసిన చేయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు 2019 డిసెంబర్ 31న తొలిసారి వైరస్ గురించి సమాచారం అందింది. జనవరి 7న కరోనా కొత్త రకం సార్స్ కోవ్ -2గా తేల్చారు. కానీ 2019లోనే చైనా వివిధ ప్రాంతాల్లో పాలిమర్ చైన్ రియాక్షన్ పరీక్షల సామగ్రి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వూహాన్ లోనే పలు లేబరేటరీలు 2019లో ఈ పరికరాల కోసం 135 కాంట్రాక్టులు ఇచ్చాయి. దీంతో పీసీఆర్ పరికరాల కొనుగోలు 600 శాతం పెరిగాయి. కొవిడ్ వ్యాప్తికి ముందే జులైలో భారీ కొనుగోళ్లు చేసింది.
పీసీఆర్ పరికరాల కొనుగోళ్లలో పెరుగుదల ఆధారంగా ఇంటర్నెట్ 2.0 ఒక అంచనా వేసింది. కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియకముందే జాగ్రత్తలు తీసుకుందని సమాచారం. కానీ ఈ విషయాలు ఎక్కడ కూడా వెల్లడించకుండా చూసుకుంది. దీంతో ప్రపంచం మొత్తం నష్టపోయింది. చైనా కుట్రలకు అందరు బలయ్యారు. వైరస్ వ్యాప్తిపై ముందే హెచ్చరిస్తే ఇంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉండేది కాదని తెలుస్తోంది.
అమెరికా నుంచి వచ్చిన సైనికులతోనే కరోనా చైనాలో వ్యాప్తి చెందిందని బుకాయిస్తోంది. వైరస్ పుట్టుకపై పలు పరిశోధనలు కొనసాగినా అందులో నిజం లేదని తప్పించుకుంటూ ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించాలని చూస్తోంది. ఇందులో భాగంగా వైరస్ ను గుర్తించడమనేది సైన్స్ కు చెందిన అంశమని నీతులు చెబుతోంది. దీంతో చైనా ప్రతిసారి తప్పించుకుంటూ పోతూ అందరిలో ఆశ్చర్యం పెంచుతోంది.