Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి 15 మంది కంటెస్టెంట్ లు కొన్ని సార్లు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ ల విషయానికి వస్తే ఒకరికొకరు బద్ద శత్రువులుగా మారుతూ గొడవ పడుతూ, అరుచుకుంటూ, చివరకు కొట్టుకునే వరకు వెళ్తున్నారు. అదే విధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల మధ్య స్నేహ బంధాలు శత్రుత్వాలు ప్రేమలు కూడా మొదలవుతూ ప్రేక్షకులకు ఈ కార్యక్రమం పై ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హీట్ ఈసారి అన్ని సీజన్ల కంటే కూడా బాగా పెరిగిపోయింది. గడిచిన నాలుగు సీజన్లకు మించి ఈసారి వాడి వేడి హీట్ పెంచుతోంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ టాస్క్ లలో ప్రాణం పెట్టి మరి ఆడుతున్నారు. ఈ నేపథ్యం లో ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ రానే వచ్చింది. సిరి హన్మంతు బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా మొదటి వారానికి గాను ఎంపిక అయ్యింది. వరుసగా రెండవ వారానికి విశ్వ, మూడో వారానికి జెస్సీ, నాలుగో వారానికి శ్రీరామచంద్ర బిగ్ బాస్ హౌస్ కెప్టెన్స్ గా నిలిచారు.
తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదల చేశారు. ఐదో వారానికి గాను కెప్టెన్సీ టాస్క్ బరిలో హౌస్ మేట్స్ రెండు టీమ్స్ గా విడిపోవాల్సిఉంది. దీనిలో భాగం గా బిగ్ బాస్ ‘ప్రజాపతి ‘ అనే టాస్క్ ని నిర్వహిస్తున్నట్టు ప్రోమో లో చూపిస్తారు. రవి, సన్నీ రాజులుగా ఎంచుకోబడినట్టు తెలుస్తుంది. ఈ టాస్క్ లో విశ్వ, మానస్ మధ్య వైరం రాచుకున్నట్టు తెలుస్తుంది.. మరి ఐదో వారానికి గాను కెప్టెన్ గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే కచ్చితంగా ఇవ్వాళ జరిగే ఎపిసోడ్ చుడాలిసిందే…
