ఇకపై మాస్కులు వాడొద్దంటున్న చైనా..!

కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా. వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలు సైతం కకావికలం అవుతున్నాయి. ప్రజలంతా కరోనా పేరుచెబితేనే బెంబెలెత్తిపోతున్నారు. కరోనాకు కారణమైన చైనా మాత్రం వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే చైనాయేతర దేశాలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా చైనా ప్రభుత్వం ఆ దేశంలో ప్రజలెవరూ కూడా మాస్కులు ధరించొద్దని సూచించడం చర్చనీయాంశంగా మారింది. Also Read: పిచ్చి పట్టిస్తున్న హోం […]

Written By: Neelambaram, Updated On : August 21, 2020 7:08 pm
Follow us on


కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా. వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలు సైతం కకావికలం అవుతున్నాయి. ప్రజలంతా కరోనా పేరుచెబితేనే బెంబెలెత్తిపోతున్నారు. కరోనాకు కారణమైన చైనా మాత్రం వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే చైనాయేతర దేశాలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా చైనా ప్రభుత్వం ఆ దేశంలో ప్రజలెవరూ కూడా మాస్కులు ధరించొద్దని సూచించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: పిచ్చి పట్టిస్తున్న హోం ఐసొలేషన్‌?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దీంతో అన్నిదేశాలు కరోనా నియంత్రణకు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు పాటిస్తున్నాయి. చాలా దేశాలు ముఖానికి మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. భారత్, బ్రెజిల్, అమెరికా వంటి దేశాలు కరోనా కట్టడిలో భాగంగా ముఖానికి మాస్కులు ధరించడం.. చేతులను శానిటైజర్లో శుభ్రం చేసుకోవడం.. భౌతిక దూరం పాటించడం లాంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు కూడా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తున్నారు.

ఇక కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా నిలిచిన చైనాలో ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించడం ఆసక్తిని రేపుతోంది. దేశ రాజధాని బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని చైనా ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గడిచిన 13రోజులుగా బీజీంగులో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: మన ఆన్ లైన్ చదువులు.. విద్యార్థులకు మంచివా? చెడ్డవా?

కరోనా నిబంధనలు, హోం క్వారంటైన్ ను చైనా కఠినంగా అమలు చేయడం వల్లే అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వమే మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం మాస్కుల్లోనే తిరుగుతుండటం గమనార్హం. ఇంకా పలువురిలో కరోనా భయం పోకపోవడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా వింతపోకడలతో ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.