హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?

భారత్-చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఘర్షణలో ఇరుదేశాలకు చెందిన సైనికులు మృత్యువాత పడ్డారు. భారత జవాన్లు 20మంది వీరమరణం పొందగా చైనా సైనికులు 35నుంచి 40వరకు మరణించినట్లు తెలుస్తోంది. చైనా సైనికులను భారత బలగాలు సమర్థవంతం తిప్పికొట్టడంతో డ్రాగన్ కంట్రీని వ్యతిరేకించే దేశాలు పెద్దఎత్తున తమ మద్దతును వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు మాట కేసీఆర్ ఎందుకు వినడం లేదు? చైనా దొంగ దెబ్బకు భారత జవాన్లు తగిన […]

Written By: Neelambaram, Updated On : June 19, 2020 9:26 pm
Follow us on


భారత్-చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఘర్షణలో ఇరుదేశాలకు చెందిన సైనికులు మృత్యువాత పడ్డారు. భారత జవాన్లు 20మంది వీరమరణం పొందగా చైనా సైనికులు 35నుంచి 40వరకు మరణించినట్లు తెలుస్తోంది. చైనా సైనికులను భారత బలగాలు సమర్థవంతం తిప్పికొట్టడంతో డ్రాగన్ కంట్రీని వ్యతిరేకించే దేశాలు పెద్దఎత్తున తమ మద్దతును వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు మాట కేసీఆర్ ఎందుకు వినడం లేదు?

చైనా దొంగ దెబ్బకు భారత జవాన్లు తగిన గుణపాఠం చెప్పారనే వార్త తెలియడంతో ఆ దేశాన్ని వ్యతిరేకించే తైవావ్, హాంకాంగ్ దేశాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ దేశాల్లో ప్రస్తుతం శ్రీరాముడికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు డ్రాగన్‌(చైనా దేశపు లోగో)పైకి బాణాన్ని ఎక్కుపెట్టిన ఫొటోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ తమ మద్దతును ప్రకటిస్తుండటం విశేషం.

తొలుత ఈ ఫొటోను హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సైట్ LIHKGలో షేర్ చేసింది. దీనిని ట్విటర్ యూజర్ హోసైలీ దాన్ని షేర్ చేశారు. దీనిని తైవాన్‌కు చెందిన తైవాన్ న్యూస్.కామ్ ‘ఫొటో ఆఫ్ ది డే’ అంటూ ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. జూన్ 16న పోస్ట్ చేసినప్పటి నుంచి 2,600 రీట్వీట్లు.. 7,600 లైక్‌లు వచ్చాయి. ఇక భారత్ ఈ ఫొటో ఎలా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనా దురాగతాలపై హాంకాంగ్‌, తైవాన్ దేశాల్లో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ చైనా, భారత్ మధ్య యుద్ధం వస్తే భారతదేశమే గెలువాలని చాలాదేశాలు కోరుకుంటున్నాయని ఈ ఫొటో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.