తాడేపల్లిలో జగన్.. హైదరాబాద్ లో బాబు

కరోనా కష్టకాలంలో ప్రజలకు తోడు ఉండేందుకు ఏ నాయకుడు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ చైతన్యం ఉన్న ఏపీలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వారికి భరోసా కల్పించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా బాధితులు తమ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు. రాష్ర్ట విభజనతరువాత చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే పలు విషయాలు తెలుస్తాయి. పెరుగుతున్న కరోనా కేసులు రాష్ర్టంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేసుల తగ్గుదలకు ఏ నాయకుడు […]

Written By: NARESH, Updated On : May 18, 2021 4:03 pm
Follow us on

కరోనా కష్టకాలంలో ప్రజలకు తోడు ఉండేందుకు ఏ నాయకుడు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ చైతన్యం ఉన్న ఏపీలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వారికి భరోసా కల్పించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా బాధితులు తమ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు. రాష్ర్ట విభజనతరువాత చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే పలు విషయాలు తెలుస్తాయి.

పెరుగుతున్న కరోనా కేసులు
రాష్ర్టంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేసుల తగ్గుదలకు ఏ నాయకుడు ప్రయత్నాలు చేయడం లేదు. రోగులు వైద్యం కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో సరిహద్దులో ఏపీ అంబులెన్స్ లను అడ్డుకుని తెలంగాణ చేసిన పనులను హైకోర్టు కల్పించుకోవడంతో దిగివచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడుతున్న బాధితుల భవితవ్యం గందరగోళంలో పడనుంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

కరనా బాధితులకు ఆర్థికసాయం
ఏపీలో కరోనా బారిన పడి చనిపోతే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేస్తున్న జగన్ ప్రభుత్వం సదుపాయాల కల్పనకు శ్రద్దచూపడం లేదు. ఫలితంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్, బెడ్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో రోగులు తమ బతుకుపై భరోసా వదులుకుంటున్నారు

రాష్ర్టంలో అత్యవసర పరిస్థితి
ఏపీలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఫలితంగా కేసుల సంఖ్య నానాటికి ఉధృతమవుతున్నాయి. అయినా సీఎం జగన్ తాడేపల్లి గూడెంలోని క్యాంపు ఆఫీసు, ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ ను వదలకుండా ఉంటున్నారు. దీంతో కరోనా బాధితులు ధైర్యం కోల్పోతున్నారు.