Pawan Kalyan- Chiranjeevi: ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. అధికార వైఎస్సార్‌సీపీకి చెక్‌పెట్టేందుకు విపక్షాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. జగన్‌ను గద్దె దించేందుకు అని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ప్రయత్నంలో జనసేనాని పవన్‌కళ్యాణ్ ముందున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. ప్రజాసమస్యలపై గళం విప్పుతున్నారు. తనదైన శైలిలో వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. పవర్‌స్టార్ ఎత్తుగడలు అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు. ఈ క్రమంలో పవన్‌కు చెక్ పెట్టడానికి వైసీపీ నుంచి కాపు నేతలు ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని పవన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.
కాపులను దూరం చేయాలనే..
కాపు నేత అయిన మాజీ మంత్రి పేర్ని నాని ఒక్కరే వైసీపీ నుంచి జనసేనానిని ఎదుర్కొనేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి ఉన్నప్పుడు.. ప్రస్తుతం మాజీ మంత్రి హోదాలోనూ పవన్ టార్గెట్‌గానే పేర్ని విమర్శలు ఉంటున్నాయి. టీడీపీ టార్గెట్‌గా కొడాలి నానిని ఉసిగొల్పుతున్న వైసీపీ.. పవన్‌పై పేర్ని నానిని ప్రయోగిస్తోంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే మాజీ మంత్రివర్యులు చిరంజీవిని పొగుడుతూ.. పవన్ కళ్యాణ్‌ను తిడుతున్నారు. దీని వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు.
Also Read: Pawan Kalyan- 2024 Elections: 2024 లో డిసైడ్ చేసేది పవన్ కళ్యాణ్ – ఎలాగో తెలుసా..!
గత ఎన్నికల్లో వైసీపీ అండగా నిలిచిన కాపులు..
ఆంధ్ర ప్రదేశ్‌లో మెజారిటీ ఓటర్లు కాపులు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా వైసీపీకి మద్దుతుగా నిలిచారు. టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో నాటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. కాపులకు రిజర్వేషన్ ఇస్తామన్న హామీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టకోకపోవడంతో కాపులు ఆ పార్టీకి క్రమంగా దూరమవుతున్నారు. తమ సామాజికవర్గానికే చెందిన జససేనాని పవన్‌కు మద్దతుగా ముందుకు వస్తున్నారు. ఇంకొందరు 2019లో కాదనుకున్న టీడీపీకి మళ్లీ మద్దతు ఇస్తున్నారు.
చిరంజీవిని పొలిటికల్ తెరపైకి తెస్తున్న వైసీపీ
కాపులు వైసీపీకి దూరమవుతూ.. జనసేనకు దగ్గరవుతున్న విషయాన్ని గుర్తించిన ఆ పార్టీ అధిష్టానం.. పవన్‌కు చెక్‌పెట్టేందుకు పెద్ద ప్లానే వేస్తోంది. ఇందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికే చెందిన మెగాస్టార్ చిరంజీవిని పొలిటికల్ తెరపైకి తెస్తోంది. పవన్ కారణంగా దూరమవుతున్న కాపు ఓటర్లు.. చిరంజీవి ద్వారా తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రజారాజ్యం పార్టీ మూసివేయడానికి కారణాలను పవన్ చెప్పారు. జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ఆలోచన లేదని చెప్పారు. దీనికి కౌంటర్‌గా పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. పవన్‌పై ఫైర్ అయ్యారు. చిరంజీవి పార్టీ పెట్టి పోరాటం చేశారని, 18 సీట్లు గెలిచారని, కానీ పవన్ కళ్యాన్ సొంత అన్ననే విమర్శలు చేస్తున్నారని, తప్పులు చేసినట్లు విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజారాజ్యం ఓడిపోయాక పవన్ కళ్యాణే పారిపోయి సొంత అన్నకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలో పూర్తిగా రాజకీయం ఉన్న విషయం అందరికీ అర్థమవుతోంది.
చిరంజీవి పొరపాట్లు నిజం..
ప్రజారాజ్యం విషయంలో చిరంజీవి కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవం. వాటినే పవన్ ప్రస్తావిస్తూ.. తాను జనసేన విషయంలో ఆ తప్పులు చేయనని చెప్పారు. కానీ పేర్ని మాత్రం పవన్.. చిరంజీవికి వెన్నుపోటు పొడిచారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంటే పవన్ వల్ల పోయే కాపు ఓట్లు చిరంజీవిని పొగిడి రాబట్టాలని, అలాగే చిరంజీవికి పవన్ వెన్నుపోటు పొడిచారని చెప్పి కాపుల్లో పవన్‌పై వ్యతిరేకత తీసుకురావాలని చూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ప్రయత్నాలు ఫలించవని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై కాపుల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో చిరంజీవి ప్రభావం పెద్దగా లేదు. ఆయనని పొగిడి, పవన్‌ని తిట్టనంత మాత్రాన దూరమై కాపులు తిరిగి దగ్గరవుతారని వైసీపీ ఆశలు ఫలించవని పేర్కొంటున్నారు.
Also Read:JanaSena- Pawan Kalyan: జనసేన సర్వేలు: పవన్ కింగ్ మేకర్.. వైసీపీ పరిస్థితి ఇదీ.. ఏం తేలిందో తెలుసా?