Oke Oka Jeevitham Collections: హీరో శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి 6 సినిమాలు ప్లాపులు తర్వాత హిట్ అందుకున్న సినిమా ‘ఒకే ఒక జీవితం’. అక్కినేని అమల కీలక పాత్రలో నటించిన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, వర్షాల ప్రభావం అయితే ఈ సినిమా పై బాగానే పడింది. మరి ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.
ముందుగా ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ను ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: JanaSena- Pawan Kalyan: జనసేన సర్వేలు: పవన్ కింగ్ మేకర్.. వైసీపీ పరిస్థితి ఇదీ.. ఏం తేలిందో తెలుసా?
నైజాం 2.77 కోట్లు
సీడెడ్ 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర 0.66 కోట్లు
ఈస్ట్ 0.42 కోట్లు
వెస్ట్ 0.45 కోట్లు
గుంటూరు 0.42 కోట్లు
కృష్ణా 0.39 కోట్లు
నెల్లూరు 0.22 కోట్లు
ఏపీ + తెలంగాణలో 11 డేస్ కలెక్షన్స్ గానూ రూ: 5.70 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 11.40 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.35 కోట్లు
ఓవర్సీస్ 1.85 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 11 డేస్ కలెక్షన్స్ గానూ రూ: 8.90 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 17. 44 కోట్లను కొల్లగొట్టింది.
ఒకే ఒక జీవితం’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ, గత కొన్ని సినిమాలుగా ప్లాప్ కావడంతో ఈ మధ్య మార్కెట్ తగ్గింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగా వస్తాయని అనుకున్నారు. కానీ బయ్యర్లకు నష్టాలు వచ్చేలా ఉన్నాయి.
Also Read:Akshara Singh: లీకైన హీరోయిన్ అశ్లీల వీడియో… లెక్క చేయనంటూ బిగ్ బాస్ భామ బోల్డ్ కామెంట్!