https://oktelugu.com/

మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన!

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్ జిల్లాలోని హవెలి ఘన్‌పూర్‌ మండలం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలకుల కుట్రల వల్లే మంజీరాపై చెక్‌ డ్యామ్‌ నిర్మించడం సాధ్యం కాలేదని అన్నారు. మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందన్నారు. 12.50 కోట్ల రూపాయలతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేసీఆర్‌ రైతుబిడ్డ అయినందునే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 20, 2020 / 04:17 PM IST
    Follow us on

    తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్ జిల్లాలోని హవెలి ఘన్‌పూర్‌ మండలం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలకుల కుట్రల వల్లే మంజీరాపై చెక్‌ డ్యామ్‌ నిర్మించడం సాధ్యం కాలేదని అన్నారు. మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందన్నారు. 12.50 కోట్ల రూపాయలతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేసీఆర్‌ రైతుబిడ్డ అయినందునే ఈ కల నేరవేరుతుందని హరీష్‌రావు తెలిపారు. మెదక్‌ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని వివరించారు. సర్దన వద్ద చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్న హరీశ్ రావు… ఈ డ్యామ్‌ ఐదు గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.

    తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజీరా నదిపై దాదాపు 15 చెక్‌ డ్యామ్‌లు మంజూరు చేయించుకున్నామని హరీశ్ రావు గుర్తు చేశారు. మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ లు నిర్మిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని… 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.