AP Politics- Cheap Liquor Deaths: ఏపీలో సారా , మద్యం రాజకీయం మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి మరణించిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది. అసెంబ్లీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఫైట్ కు కారణమైంది. ఏపీలో ఈ మద్య ప్రవాహం.. నాసిరకం బ్రాండ్లకు ఎవరు బాధ్యులన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీనిపై స్పెషల్ ఫోకస్…
జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలకు జగన్ ప్రభుత్వమే కారణమని టీడీపీ ఆందోళన బాటపట్టింది. అసెంబ్లీలో రచ్చ చేస్తోంది. ఏకంగా నిన్న సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నారాలోకేష్ అసెంబ్లీ ఎదుట పెద్ద ఉద్యమమే చేశారు. అయితే ఏపీలో ఈ చీప్ లిక్కర్, నాసిరకం బ్రాండ్లకు ఆద్యుడు చంద్రబాబేనని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. ఈ మేరకు చంద్రబాబు హయాంలో మద్యం కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు.. చీప్ లిక్కర్ సృష్టికర్త చంద్రబాబుయే అన్న ఆధారాలు కూడా బయటపెట్టారు. దీంతో పోరాటం చేస్తున్న టీడీపీ డిఫెన్స్ లో పడింది.
Also Read: Jobs: ఎట్టకేలకు నిరుద్యోగుల ‘ఆకలి’ తీర్చనున్న కేసీఆర్
ఏపీలో ఈ కొత్త కొత్త బ్రాండ్లు, నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చింది చంద్రబాబేనని జీవోలను బట్టి తెలుస్తోంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఏపీలో 20 మద్యం డిస్టలరీలున్నాయి. 1982కు ముందు ఉన్న 5 కంపెనీలు మాత్రమే. తర్వాత చంద్రబాబు హయాంలోనే 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. చంద్రబాబు విడిపోయిన ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2014-19 మధ్యలో ఏకంగా 7 డిస్టిలరీలను తెచ్చారు.
ఇక జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి మద్యం పాలసీలో ఎటువంటి మార్పు చేయలేదు. చంద్రబాబు ఓకే చేసిన మద్యం కంపెనీల నుంచే వైన్ షాపులకు ఆ మద్యాన్ని సరఫరా చేయించారు. బూంభూం బీర్, ప్రెసిడెన్స్ మెడల్, గవర్నర్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రొమనోవా, ఏసీబీ, 999 లెజెండ్ వంటి హీరోలు, నేతల పేర్లతో 200 బ్రాండ్లు చంద్రబాబు తీసుకొచ్చారని జీవోలో ఉంది. విశేషం ఏంటే.. తన సన్నిహితులైన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పేర్ల మీద కూడా ఏపీలో మద్యం బ్రాండ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అనడంలో సందేహం లేదు..
ఇక ఈ నాసిరకం బ్రాండ్లు అన్నీ కూడా చంద్రబాబు హయాంలో వస్తే.. ఆ బ్రాండ్లు అన్నీ కూడా జగన్ తీసుకొచ్చినవేనని టీడీపీ విమర్శిస్తోంది. అయితే జగన్ చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే.. ఈ నాసిరకం మద్యం ధరలను అధికారంలోకి వచ్చాక భారీగా పెంచడం.. మద్యపాన నిషేధం వాగ్దానం చేసిన జగన్… లిక్కర్ ను నియంత్రించాల్సింది పోయి.. ధరలు పెంచితే జనాలు మద్యం మానేస్తారని ఈ ప్లాన్ చేశారు. ఇది ఏపీలో ఇఫ్పుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లిక్కర్ మానేయలేక.. ఇంత ధర పెట్టి కొనలేక చాలా మంది నిరుపేదలు కల్తీ సారాకు బానిస అయ్యారు. అది తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. జంగారెడ్డి గూడెంలో వెలుగుచూసిన ఘటనలో చాలా మంది ప్రాణాలు పోవడానికి అసలు కారణం ఇదే..
ఏపీలోని మద్యం బ్రాండ్లు చంద్రబాబు తెచ్చినా.. వాటి రేటు సామాన్యులు కొనలేకుండా మద్యపాన నిషేధం ముసుగులో భారీగా పెంచి ఈ ఉపద్రవాలకు కారణం అయ్యింది జగన్ సర్కారే. చంద్రబాబు తెచ్చిన ఆ బ్రాండ్లను రద్దు చేసే అధికారం.. ఈ నాసిరకం బ్రాండ్లను కంట్రోల్ చేసే స్టామినా జగన్ కు ఉన్నా ఎందుకు చేయలేదన్నది ప్రశ్న. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని నడిపేందుకు జగన్ ఇప్పుడు ‘మద్యం’ఫైనే ఆధారపడుతున్నాడన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఈ పాపాలను చంద్రబాబుపై నెపం పెట్టి తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Also Read: Marri Shashidar Reddy: బోయగూడా దుర్ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. మంత్రి తమ్ముడిపై సంచలన ఆరోపణలు
Recommended Video: