Whatsapp : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ రోజూ ఉదయం లేవగానే అలారం కంటే ముందే మోగే వాట్సాప్ ఓపెన్ చేస్తుంటారు. పక్క నుంచి లేస్తూనే వాట్సాప్ మెసేజ్‌లు చెక్ చేయడం అందరికీ అలవాటుగా మారిపోయింది. వాట్సాప్ వాడే వారి సంఖ్య రోజుకరోజుకు నిరంతరం పెరుగుతుంది. అందుకు తగ్గట్లే వాట్సాప్ కూడా నిరంతరం కస్టమర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతుంది. ఈ క్రమంలోనే వాట్సాప్ తన సేవల్లో చాట్ జీపీటీ(ChatGPT)ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ChatGPT – వాట్సాప్‌లో కొత్తగా ఏమి చేయనుంది?
ChatGPT సేవలను మెరుగుపరిచేందుకు 18002428478 నంబర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు టెక్ట్స్ మెసేజ్‌లకు మాత్రమే సమాధానాలు ఇస్తూ ఉండగా, తాజాగా ఫోటో & వాయిస్ మెసేజ్‌లకు కూడా స్పందించే విధంగా టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేశారు.
ఇప్పుడు మీరు ఏం చేయవచ్చు?
ప్రస్తుతం మీరు ఫోటోను పంపితే దానిలో ఏది ఉందో, దాని అర్థం, దాని గురించి సమాచారం అందిస్తుంది. అలాగే మీరు వాయిస్ మెసేజ్ పంపితే దానిని అర్థం చేసుకుని సమాధానం చెబుతుంది. మీరు టెక్ట్స్ పంపితే ఇదివరకే ఉన్నట్లుగా సాధారణంగా మీరు కోరిన ప్రశ్నలకు సమాధానం అందిస్తుంది.
వాయిస్ & ఫోటో ఇంటిగ్రేషన్ ఎందుకు ప్రత్యేకం?
ChatGPT ఇప్పటివరకు టెక్స్ట్ బేస్డ్ AI చాట్‌బాట్‌గా మాత్రమే వినియోగించుకునేవారు. అయితే, చాలామందికి టైప్ చేయడం కంటే వాయిస్ మెసేజ్‌లు రికార్డ్ చేసి పంపడం సులభంగా భావిస్తారు. అలాగే, కొన్నిసార్లు టెక్స్ట్ ద్వారా వివరించలేని ఫోటోలు, స్క్రీన్‌షాట్లు, డాక్యుమెంట్లను పంపడం వల్ల సమాధానాలు త్వరగా, కచ్చితంగా అందుకోవచ్చు.
ChatGPT వాట్సాప్‌లో ఎలా ఉపయోగించుకోవాలి?
* స్టెప్ 1: మీ ఫోన్‌లో 18002428478 నంబర్ సేవ్ చేసుకోండి.
* స్టెప్ 2: వాట్సాప్ ఓపెన్ చేసి, అదే నంబర్‌కి మెసేజ్ పంపండి.
* స్టెప్ 3: మీకు కావాల్సిన సమాచారం – టెక్ట్స్, వాయిస్ నోట్, ఫోటో – ఏదైనా పంపండి.
* స్టెప్ 4: ChatGPT మీ సందేశాన్ని ప్రాసెస్ చేసి, తగిన సమాధానం పంపిస్తుంది.
ఇది బిజినెస్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ట్రావెల్, హెల్త్ వంటి అనేక విభాగాల్లో ఉపయోగపడనుంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎవరికీ లాభం?
విద్యార్థులకు ఏదైనా టాప్‌యిక్, అర్థంకాని విషయం గురించి సరళంగా వివరించుకోవచ్చు. వృత్తి నిపుణులు తమ పని తీరును వేగవంతం చేసుకోవడానికి టెక్స్ట్ రాయడమేకాక, ఆడియో ద్వారా వివరించి సమాధానం పొందొచ్చు. ట్రావెలర్స్ ఎక్కడికైనా వెళ్లే ముందు, తాము చూసే నూతన ప్రదేశాల గురించి ఫోటో ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. వ్యాపారులు తమ డాక్యుమెంట్లను పంపి వివరణ పొందవచ్చు.
భవిష్యత్తులో ఇంకా ఏ కొత్త మార్పులు రావొచ్చు?
ChatGPT టెక్నాలజీ మరింత అప్‌గ్రేడ్ చేయబడి, వీడియో ఇంటిగ్రేషన్ కూడా రావొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అంటే భవిష్యత్తులో మీరు వీడియో పంపితే, దానిపై కూడా వివరమైన విశ్లేషణ పొందే అవకాశముంది. వివిధ ఫీల్డ్‌లలో పనిచేసే వ్యక్తులకు, విద్యార్థులకు, నిత్యజీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకునే వారికి ఈ కొత్త అప్‌డేట్ అమితంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్‌కి పైగా యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. దానిలో AI ఇంటిగ్రేషన్ వల్ల ఈ సేవలు మరింత వేగంగా, సమర్థంగా మారనున్నాయి.