Hari Hara Veera Mallu Child Artist: ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఎట్టకేలకు ఎన్నో ఆటంకాలను ఎదురుకొని, షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే నెల 28వ తారీఖున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన షూటింగ్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. కేవలం కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇతర తారాగణం కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు నేడు సారధి స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. ఇదే ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ అట. ఈ షెడ్యూల్ లో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ పాల్గొనాలి. కానీ ఆయన డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఆయనకు బదులుగా ప్రముఖ తమిళ నటుడు సత్య రాజ్ ని తీసుకున్నారు. ఈ షెడ్యూల్ లో ఆయన కూడా పాల్గొనబోతున్నాడు. పవన్ కళ్యాణ్ తో సత్యరాజ్ కి కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయట. కేవలం నాలుగు రోజుల డేట్స్ ని పవన్ కళ్యాణ్ ఇస్తే సరిపోతుంది.
ఈ నెలలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి, మార్చి 10 లోపు సినిమాని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ చిత్రం నిర్మాత AM రత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్లు వేశారు. కొంతమంది అయితే ఫన్నీ గా ‘హరి హర వీరమల్లు’ చిత్రం మీద వేసిన జోకులు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ తో డీలింగ్ కోసం అప్పటికప్పుడు టీజర్ కట్ చేసి విడుదల చేయాల్సి వచ్చింది. ఈ టీజర్ ప్రారంభం లో ఒక చిన్నారి ఏడుస్తూ కనిపిస్తుంది, ఆమె మీకు గుర్తుందా?
ఆ చిన్నారి పేరు ఆరోహి పటేల్. ఈమె సూరత్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్స్, అలాగే కొన్ని సినిమాల్లోనూ ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఈమెని ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర కోసం ఈ సినిమా ప్రారంభ సమయంలో తీసుకున్నారు. అప్పట్లో చిన్న అమ్మాయిగా కనిపించిన ఈమె, ఈ నాలుగేళ్లలో ఎలా తయారైందో మీరే చూడండి. ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ తెరిచి చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నాన్ స్టాప్ గా రీల్స్ చేస్తూ నెటిజెన్స్ దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంది. నేటి తరం హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో కుర్రాళ్లకు మెంటలెక్కిపోయేలా చేస్తుంది. అయితే అభిమానులు సోషల్ మీడియా లో ఈ అమ్మాయి హీరోయిన్ అయ్యేలోపు అయినా ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని విడుదల చేయండిరా అంటూ ఫన్నీ కామెంట్స్ చేయగా అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
View this post on Instagram