ప్రజారవాణాలో మార్పులు చేర్పులు!

గత 46 రోజులుగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ,మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో కోట్ల రూపాయల నష్టం జరిగింది. అయితే మే 15న సమీక్షించి బస్సుల ప్రారంభం పై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే మే 15 తర్వాత పలు మార్పులు చేసి ప్రజా రవాణాను ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమైందని తెలుస్తోంది. బస్సులలో స్టాండింగ్ జర్నీ నిషేధించనున్నారు. అదే విధంగా ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో […]

Written By: Neelambaram, Updated On : May 9, 2020 11:19 am
Follow us on

గత 46 రోజులుగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ,మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో కోట్ల రూపాయల నష్టం జరిగింది. అయితే మే 15న సమీక్షించి బస్సుల ప్రారంభం పై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే మే 15 తర్వాత పలు మార్పులు చేసి ప్రజా రవాణాను ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమైందని తెలుస్తోంది. బస్సులలో స్టాండింగ్ జర్నీ నిషేధించనున్నారు. అదే విధంగా ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి అనుమతినివ్వనున్నారు. మెట్రో రైళ్లలో 900 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇక నుంచి కొద్ది మందితోనే రైళ్లను నడపనున్నారు. అదే విధంగా మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు నిల్చునేందుకు వీలుగా తెలుపు రంగు సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నారు. బస్సులు మరియు మెట్రో రైళ్లలోకి మాస్కులు ఉంటేనే ప్రయాణికులను అనుమతించనున్నారు. స్టేషన్ లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయనున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. అదే విధంగా 22 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో త్వరలోనే పలు మార్పులతో ప్రజా రవాణాను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.