Homeజాతీయ వార్తలుVoter ID: మీ పాత ఓటర్‌ ఐడీ కార్డ్ ను ఇలా కొత్తగా మార్చుకోండి!

Voter ID: మీ పాత ఓటర్‌ ఐడీ కార్డ్ ను ఇలా కొత్తగా మార్చుకోండి!

Voter ID: పార్లమెంటుతోపాటు దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ వచ్చింది. మరోవైపు ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులకు కూడా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇక పాత వారు కూడా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చెక్‌చేసుకోవాలని సూచించింది. ఫాం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

డిజిటల్‌ కార్డులు..
ఇదిలా ఉండగా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న వారికి డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డులు జారీ అవుతున్నాయి. అయితే దేశంలో చాలా మంది పాత ఓటరు కార్డులనే ఇంకా వాడుతున్నారు. అయితే పాత కార్డును కూడా కొత్తగా మార్చుకునే అవకాశం ఉంది. దానిని ఎలా పొందాలి అనే విషయాలను తెలుసుకుందాం.

– ఈ ప్రక్రియ ద్వారా మనం మొబైల్‌లోనే మన ఓటర్‌ ఐడీ కార్డును డిజిటల్‌ రూపంలో మార్చుకోవచ్చు. ఆధార్‌ కార్డు లాగా లామినేషన్‌ చేయించుకోవచ్చు.
– ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ http://voters.cgg.gov.in/login లోకి వెళ్లాలి. అక్కడ ఫోన్ నంబర్‌ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ.. మొబైల్‌ నంబర్‌ ఇచ్చాక, మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేస్తే, పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోమని చెబుతుంది. అది ఇవ్వగానే.. రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. మొబైల్‌ నంబర్, పాస్‌వర్డ్‌ ఇచ్చి, కింద కాప్చా నంబర్‌ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వొచ్చు.

– కాప్చా నంబర్‌ ఎంటర్‌ చేశాక రిక్వెస్ట్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంటర్‌ చేసి వెరిఫై అండ్‌ లాగిన్‌ క్లిక్‌ చేయాలి. తర్వాత కుడివైపు కింద మూల ఉన్న ఈ ఎపిక్‌ డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది దానిపై క్లిక్‌ చెయ్యాలి.

– ఇక్కడ ఎంటర్‌ ఎపిక్‌ నంబర్‌ అంటుంది. దానిని మీ పాతకార్డుపై ఉన్న ఎపిక్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత సెలెక్ట్‌ స్టేట్‌ ఎంపిక చేయాలి. తర్వాత సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

– ఇప్పుడు మీకు మీ ఐటర్‌ ఐడీకి సంబంధించిన వివరాలను చూపిస్తుంది. ఆ వివరాలు సరైనవే అని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు కింద ఉన్న సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.

– దీంతో మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసి
ఇప్పుడు మీ మొబైల్‌కి వచ్చే ఓటీపీ ఎంటర్‌ చేసి, వెరిఫై బాక్స్‌పై క్లిక్‌ చేయాలి.

– తర్వాత మీరు ఎంటర్‌ చేసిన ఓటీపీ కరెక్ట్‌ అయితే, కరెక్ట్‌ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీరు మీ డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డు కోసం డౌన్‌లోడ్‌ ఈ ఎపిక్‌ పై క్లిక్‌ చేయాలి.

– తర్వాత డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డు మీ మొబైల్‌లో పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో సేవ్‌ అవుతుంది. దానిని ప్రింట్‌ తీసుకోవచ్చు, లేమినేషన్‌ చేయించుకోవచ్చు. ఆధార్‌ కార్డ్‌ తరహాలో చేయించుకోవచ్చు. లేదా మొబైల్‌లోనే సేవ్‌ చేసుకొని, అవసరమైనప్పుడు, ఎవరైనా అధికారులు చూపించమన్నప్పుడు చూపించవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular