Chandrayaan 3 vs Prakash Raj : చంద్రయాన్_ 3 విజయవంతం: నటుడు ప్రకాష్ రాజ్ ను ఆడుకుంటున్న నెటిజన్లు

"అరెస్ట్ ప్రకాష్ రాజ్" అనే యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written By: Bhaskar, Updated On : August 23, 2023 11:08 pm

prakash raj isro

Follow us on

Chandrayaan 3 vs Prakash Raj : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అదే నోరు జారితే ఊరు మొత్తం తిరగబడుతుంది. పై సామెత విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు అనుభవంలోకి వచ్చింది. “జస్ట్ ఆస్కింగ్” పేరుతో బిజెపి విధానాలు మాత్రమే ప్రశ్నించే ఈ నటుడు.. కొన్ని కొన్ని సార్లు తన లైన్ దాటి మాట్లాడుతుంటారు. అవి విమర్శ లాగా ఉంటే బాగానే ఉంటుంది. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఉండటంతోనే అసలు సమస్య వస్తోంది. ప్రకాష్ రాజ్ సమర్థవంతమైన నటుడు. పలు అంశాల మీద పట్టు ఉంది. కానీ “అతి సర్వత్రా వర్జయేత్” అనే సామెత లాగా.. తిక్క తిక్కగా మాట్లాడుతుండడం ప్రకాష్ రాజ్ ను నవ్వులపాలు చేస్తోంది. గతంలో ఇలాగే బిజెపి మీద విమర్శలు చేయడంతో పలు పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కూడా ఒక విషయాన్ని అదే పనిగా గెలకడంతో కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు చంద్రయాన్_3 విజయవంతమైన తర్వాత దేశంలోని అన్ని వేళ్ళూ కూడా ఆయన వైపు చూపిస్తున్నాయి.

చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో దేశంలోని నెటిజన్లు ప్రకాష్ రాజ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇటీవల చేసిన ఒక ట్వీట్ దీనికి కారణం. లుంగీ కట్టుకొని, బనియన్ వేసుకొని మీసాలు ఉన్న ఒక వ్యక్తి ( కార్టూన్ రూపంలో) తాను తయారు చేసిన టీ ని చల్లార్చుతుంటాడు. ఒక కప్పు నుంచి మరొక కప్పులోకి జారవిడుస్తూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూపించి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ _3 ద్వారా మొట్టమొదటిగా భూమి మీదకు వచ్చిన ఫోటో ఇదే అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ప్రకాష్ రాజ్ మీద సంఘాలు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి.

అయితే ప్రస్తుతం చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో దేశంలోని నెటిజన్లు ప్రకాష్ రాజ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి ప్రయోగం చేస్తే.. దానిని హేళన చేస్తూ ఫోటో ట్వీట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ ఆలయంలో పూజలు చేస్తే ప్రకాష్ రాజ్ కు వచ్చిన బాధ ఏమిటని వారు అడుగుతున్నారు. “బిజెపి విధానాలను నచ్చకపోతే వానిని విమర్శించడంలో తప్పులేదు. కానీ దేశానికి సంబంధించిన విషయాలలో అడ్డగోలుగా మాట్లాడడం సరికాదు. ఒక ప్రతిభావంతమైన వ్యక్తి ఇలా చేయడం బుద్ధి తక్కువ పని” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “అరెస్ట్ ప్రకాష్ రాజ్” అనే యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.