బాబు కొత్త పాలసీ ఇదేనా!

రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాజకీయ వ్యూహం ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధికారం చేపట్టిన అనంతరం ఐదేళ్లు చంద్రబాబు వ్యూహాలు బెడిచి కొట్టాయని చెప్పడానికి గత ఎన్నికల్లో భారీ పరాజయమే నిదర్శనం. 2014 నుంచి రెండేళ్లపాటు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు తదననంతరం క్రమంగా బీజేపీని పక్కకు నెట్టేశారు. ఫ్యాకేజీ ఇచ్చారనే పేరుతో శాసనసభలో మోడీని అభినందిస్తూ తీర్మానం చేశారు. కొద్దీ […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 2:21 pm
Follow us on


రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాజకీయ వ్యూహం ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధికారం చేపట్టిన అనంతరం ఐదేళ్లు చంద్రబాబు వ్యూహాలు బెడిచి కొట్టాయని చెప్పడానికి గత ఎన్నికల్లో భారీ పరాజయమే నిదర్శనం. 2014 నుంచి రెండేళ్లపాటు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు తదననంతరం క్రమంగా బీజేపీని పక్కకు నెట్టేశారు. ఫ్యాకేజీ ఇచ్చారనే పేరుతో శాసనసభలో మోడీని అభినందిస్తూ తీర్మానం చేశారు. కొద్దీ నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ తిట్టిపోశారు. బీజేపీ పొత్తు తెగతెంపులు చేసుకున్నారు. దీంతో బీజేపీ నేతలు టీడీపీ అవినీతిని ప్రశ్నిస్తూ పలు సందర్భాలలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.

గత ఎన్నికల అనంతరం పరిస్థితి తారుమారు అవడంతో చంద్రబాబు ఆత్మ రక్షణలో పడ్డారు. జగన్ ప్రభుత్వం నుంచి వచ్చే వత్తిడిని తట్టుకోవడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరమని భావించడంతో ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీకి దగ్గరయ్యేందు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలను బీజేపీలో చేరేందుకు వ్యూహరచన చంద్రబాబుదేననే వాదనలు వినిపించాయి. సమస్యలను అవకాశాలుగా మార్చుకోవాలని నిత్యం చెప్పే చంద్రబాబు కరోనా సమస్యను బీజేపీకి దగ్గరయ్యే అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

లాక్ డౌన్ విషయంలో ప్రధాని మోడీ సరైన నిర్ణయం తీసుకున్నారని, ఫలితంగా దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని ఇటీవల విలేకర్ల సమావేశంలో చెప్పుకొచ్చారు. మోడీ ప్రతిపక్షాలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులను సంప్రదించారని, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఎడిటర్లతో మాట్లాడారన్నారు. జాతీయ స్థాయిలో మోదీ ఏకాభిప్రాయం తెచ్చారని, మనదేశంలో లాక్ డౌన్-1 సత్ఫలితాలు ఇవ్వడంతో ధైర్యంగా లాక్ డౌన్-2 ప్రకటించారంటూ మోడీని పొగడ్తలతో ముంచెత్తారు.

మరోవైపు దేశంలో దేశంలో కరోనా వ్యాప్తిలో 9వ స్థానానికి పరిమితమైన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవాలను వెల్లడించడం లేదంటూ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణాలో మరిన్ని ఎక్కువ కేసులు నమోదైనా అక్కడి ప్రభుత్వంపై ఒక్కమాట మాట్లాడక పోవడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.

దేశం అంతా లాక్ డౌన్ సపలం అయితే ఎపిలో మాత్రం అవడం లేదా అనే ప్రశ్న ఉత్పనమవుతుంది. మోడీని పొగుడు.. జగన్ ను తిట్టూ..ఇది చంద్రబాబు కొత్త పాలసిలా ఉందనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది.