ఒంటరిగా గెలవలేనని టీడీపీ అధినేత చంద్రబాబుకు అర్థమైంది. అందుకే బీజేపీతో పొత్తుకు మళ్లీ వెంపర్లాడాడు. తాజాగా మహానాడు వేదికగా వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలతో కలుస్తానని ప్రకటించారు. బీజేపీ, జనసేన , కమ్యూనిస్టులతో కలిసి వైసీపీని ఓడిస్తామని చంద్రబాబు అన్నారు. బీజేపీతో పొత్తుకోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇప్పుడు సడెన్ గా ఎన్నికలు కూడా లేకపోయినా ఈ ఆఫర్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.
చంద్రబాబు ఆఫర్ ను బీజేపీ అడ్డంగా తిరస్కరించింది. గతంలో మోడీని ఓడించడానికి రాజకీయ చేసిన చంద్రబాబు చంద్రబాబు ఇప్పుడు కలిసి పనిచేద్దామంటూ ఆఫర్ ఎలా ఇస్తారని బీజేపీ ఘాటుగా ప్రశ్నించింది. దీంతో బీజేపీతో వెళుదామనుకుంటున్న టీడీపీకి గట్టి షాక్ తగిలింది.
ఇక మహానాడులో చంద్రబాబు ఆఫర్ ను బీజేపీ అడ్డంగా నో చెప్పింది. ఏపీ బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ ఘాటుగా ట్వీట్ చేశాడు. చంద్రబాబుకు గతాన్ని గుర్తు చేస్తూ ధియోదర్ ఏకిపారేశారు. బాబు ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్టు ముఖంమీదే చెప్పేశారు. సునీల్ ధియోధర్ టీడీపీతోపాటు వైసీపీపైనా తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సునీల్ ధియేధర్ ట్వీట్ చేస్తూ.. ‘గతంలో మామ ఎన్టీఆర్ కు పొడిచిన చంద్రబాబు.. ఆ తర్వాత 2019లో ప్రధాని మోడీకి వెన్నుపోటు పొడిచారంటూ సునీల్ ధియేధర్ అన్నారు. 2024లో బీజేపీతో కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ టీడీపీని బతికించుకునేందుకే అంటూ సునీల్ ధియేధర్ వ్యాఖ్యానించారు.
ఇలా బీజేపీతో పొత్తుకు మహానాడు వేదికగా చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ను బీజేపీ గట్టిగా తిరస్కరించింది. ఏపీలో బీజేపీతో స్నేహం కోసం టీడీపీ అధినేత చేసిన ఎత్తుగడకు దెబ్బపడిందనే చెప్పాలి.
In Mahanadu, Chandrababu Naidu repeated his desperate stunt to show that TDP will allign with @BJP4India in 2024. @BJP4Andhra & @JanaSenaParty under leadership of @somuveerraju & @PawanKalyan will emerge as an alternative to corrupt, family politics of @ysjagan–@ncbn.@AmitShah pic.twitter.com/WZ6zSl6TLs
— Sunil Deodhar (@Sunil_Deodhar) May 29, 2021