https://oktelugu.com/

Chandrababu: ఆ మూడు జిల్లాలపై చంద్రబాబు నయా స్కెచ్… అసలు కారణం అదే?

పెన్నా టు నాగావళి పేరిట చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 31, 2023 / 01:57 PM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: వైసిపి కంచుకోటలపై చంద్రబాబు దృష్టి పెట్టారా? వచ్చే ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారా? రాయలసీమపై ఫోకస్ పెంచడం అందులో భాగమేనా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రేపట్నుంచి పది రోజులు పాటు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన సంగతి తెలిసిందే. ముందుగా రాయలసీమ నుంచే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టానున్నారు. దీని వెనక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

    పెన్నా టు నాగావళి పేరిట చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వైసిపి సర్కార్ ఈ ప్రాజెక్టులపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టనున్నారు. ముందుగా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. నందికొట్కూరులో చంద్రబాబు రోడ్ షో, అనంతరం బహిరంగ సభ ఉంటుంది. మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ను సందర్శిస్తారు. ఆగస్టు 2న కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందులలో చంద్రబాబు పర్యటన ఖరారైంది. కొండాపురం మండలం గండికోట ప్రాజెక్ట్, ఎత్తిపోతల పథకాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం పులివెందులలోని పూలంగళ్ళ రోడ్ షో, బహిరంగ సభ, ఉంటుంది.

    అయితే చంద్రబాబు పక్కా వ్యూహంతోనే పులివెందుల వెళ్తున్నట్టు తెలుస్తోంది. జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆ నియోజకవర్గ బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీ భరత్ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే దీనికి విరుగుడు చర్యగా చంద్రబాబు పులివెందులపై ఫోకస్ పెంచారు. రాయలసీమలోని కర్నూలు,కడప తో పాటు నెల్లూరులో దారుణంగా దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.

    వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి నడవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ కలయిక ద్వారా రాయలసీమలో వైసీపీకి దారుణంగా దెబ్బ కొట్టాలన్న భావనతో ఉన్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు జనసేనకు టచ్ లోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూటమి తరుపున బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని రాయలసీమ నుంచి ప్రారంభించడం వెనుక ఉద్దేశం అదేనని తెలుస్తోంది. చూడాలి చంద్రబాబు ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో?