Homeఎంటర్టైన్మెంట్Brahmanandam meets Jagan: మాజీ సీఎం జగన్ తో కమెడియన్ బ్రహ్మానందం భేటీ..కారణం ఏంటంటే!

Brahmanandam meets Jagan: మాజీ సీఎం జగన్ తో కమెడియన్ బ్రహ్మానందం భేటీ..కారణం ఏంటంటే!

Brahmanandam meets Jagan: రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక కాంపౌండ్ కి చెందిన వాళ్ళు, మరో కాంపౌండ్ లోకి వెళ్తే పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మొదటి నుండి ప్రాణ స్నేహితుడిగా చలామణి అవుతూ వచ్చిన కమెడియన్ అలీ, అప్పట్లో వైసీపీ పార్టీ లో చేరడం ఎంతటి సంచలన టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కూడా తనని అలా వదిలి వెళ్ళిపోయినందుకు చాలా బాధ పడ్డాడు. ఒక పబ్లిక్ మీటింగ్ లో అలీ పై తన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. అందుకు అలీ కూడా కౌంటర్ ఇవ్వాల్సి వచింది. అరెరే మంచి స్నేహితులు, ఇలా విడిపోయారు అని అంతా అనుకున్నారు. అది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు హాస్య బ్రహ్మ, లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం మాజీ సీఎం జగన్ ని కలవడం కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

బ్రహ్మానందం చిరంజీవి కుటుంబానికి ఎంతో మంచి సన్నిహితుడు. ఒక విధంగా తాను సినిమాల్లో ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం చిరంజీవి అని ఎన్నో సందర్భాల్లో బహ్మనందం చెప్పుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ కి కూడా ఆయన అత్యంత ఆప్తుడు. తన సోదరుడిగా చూస్తుంటాడు. అలాంటి బ్రహ్మానందం ఇలా అకస్మాత్తుగా జగన్ ని కలవడం ఏంటి?, కొంపదీసి వైసీపీ పార్టీ లో చేరుతున్నాడా ఏంటి అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేశారు. కానీ అలాంటిదేమి లేదట. నేడు గన్నవరం విమానాశ్రయం లో జగన్ కనిపించగా, ఆయన పలకరించడం, బ్రహ్మానందం కూడా ఆయన వద్దకు వెళ్లి కరచాలనం ఇచ్చి ఫోటో దిగడం వంటివి జరిగాయి. అంతే తప్ప , బ్రహ్మానందం ఏ రాజకీయ పార్టీ కి చెందిన వాడు కాదు, భవిష్యత్తులో కూడా ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్.

ఒకప్పుడు ఏడాదికి 20 కి పైగా సినిమాలు చేసేవాడు బ్రహ్మానందం. ఒక్కోసారి ఆయన ఏడాదికి 50 కి పైగా సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈమధ్య కాలం లో ఆయన సినిమాల సంఖ్య బాగా తగ్గించేసాడు. కారణం గుండె ఆపరేషన్ జరగడం వల్లే. అయినప్పటికీ ఆయన ఏడాది పది లోపు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది ఆయన ‘గేమ్ చేంజర్’, ‘బ్రహ్మ ఆనందం’, ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి ‘, ‘జూనియర్’, ‘మిత్రమండలి’, ‘గుర్రం పాపి రెడ్డి’ వంటి చిత్రాల్లో నటించాడు. ఈ ఏడాది ఆయన ‘సహాకుటుంబాణాం’ అనే సినిమా మాత్రమే విడుదలైంది. జనవరి 1 న ఈ సినిమా విడుదలైంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version