Kajal Aggarwal career in trouble: ఒకప్పుడు సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్. స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం పడిగాపులు కాచేవారు. తెలుగు, తమిళం లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన ఆమె హీరోయిన్ గా నటించింది. యూత్ ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించింది. కానీ ఇప్పుడు చేతిలో ఒక్క అవకాశం కూడా లేక, కెరీర్ ని ముగించే స్థితిలో ఉంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, కాజల్ అగర్వాల్(Kajal Agarwal). ఈమె కెరీర్ ని పెళ్ళికి ముందు, ఆ తర్వాత అని డివైడ్ చేయొచ్చు. పెళ్ళికి ముందు ఈమె చేతినిండా సినిమా ఆఫర్లతో ఎంత మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి వచ్చినా, వాళ్ళని డామినేట్ చేస్తూ, తన సత్తా చాటుతూ ముందుకు దూసుకుపోయింది. కానీ పెళ్లి తర్వాత ఆమె సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది.
మగబిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ‘సత్య భామ’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మన ముందుకొచ్చింది. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత తమిళంలో కూడా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది, వర్కౌట్ అవ్వలేదు. పెళ్లి జరిగిన కొత్తల్లో ఈమెకు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. కానీ కథకు ఆమె పాత్ర అడ్డు వస్తుందని, ఆమెకు సంబంధించిన సన్నివేశాలను తొలగించేసారు. పెళ్లి తర్వాత ఆమెకు దొరికిన సరైన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే, అది ‘భగవంత్ కేసరి’ మాత్రమే. నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన ‘సికిందర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.
అదే విధంగా గత ఏడాది ఈమె ‘కన్నప్ప’ చిత్రం ల పార్వతి రోల్ లో కనిపించింది. అవి ఆమె కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె హిందీ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో రావణుడి భార్య మండోదరి గా నటిస్తుంది అంటూ వార్తలు వినిపించాయి. ఇది కేవలం వార్తలకే పరిమితం అయ్యింది కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది కాకుండా ఆమె చేతుల్లో ఉన్నది ‘ఇండియన్ 3’. ఇది సెట్స్ మీదకు వెళ్తుంది అనే నమ్మకం కూడా లేదు. దీంతో చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఖాళీగా ఉండిపోయింది ఈ హాట్ బ్యూటీ. హీరోయిన్ రోల్స్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం క్యారెక్టర్ రోల్స్, లేదా విలన్ రోల్స్ వచ్చినా చేయమని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె చేయడానికి సిద్దమే, కానీ అవకాశాలు ఇచ్చేవాళ్లే లేరు.