Chandrababu: వచ్చే ఎన్నికలు టీడీపీకి చావోరేవోలాంటివి. ఆ విషయంలో సగటు టీడీపీ కార్యకర్త నుంచి అధినేత చంద్రబాబు వరకూ తెలుసు. అందుకే విజయానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు చంద్రబాబు. అయితే ఆయన ప్రతీ ఎన్నికకు వ్యూహం మారుస్తుంటారు. గత ఎన్నికల్లో బీజేపీని కార్నర్ చేసి లబ్ధిపొందాలని చూసిన బొక్క బోర్లా పడ్డారు. బీజేపీని దూరం చేసుకొని మూల్యం చెల్లించుకున్నారు. అధికారానికి దూరమయ్యారు. తీ ప్రతిపక్షంలో కూర్చున్నాక ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయనకు తత్వం బోధపడింది. తనకు బీజేపీ శత్రువు కాదు.. శాశ్వత శత్రువు జగనేనని అర్ధమైంది. అందుకే బీజేపీని మచ్చిక చేసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో విజయానికి వ్యూహాలు పన్నుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకోగా.. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ తో పాటు రాష్ట్రంలో తనకు వ్యతిరేకులుగా ఉన్న శక్తులన్నీ చంద్రబాబును ఇరుకున పెట్టి ఓడించాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒంటరిని చేసి విపక్షం కూర్చోబెట్టాయి.పైగా చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ కు కుటుంబ బలం పనికొచ్చింది. అందుకే ఈ సారి అటు కేంద్రంలో ఉన్న బీజేపీతో చెలిమి.. ఇటు కుటుంబ బలగాన్ని, బంధుగణాన్నిదించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

ఆ ఆరు జిల్లాలు బాలయ్యకు..
రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ప్రాంతాలున్నాయి. రాయలసీమ, కోస్తా, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాలున్నాయి. ఇప్పటికే ఈ నాలుగు ప్రాంతాలరాకు వైసీపీకి సంబంధించి పార్టీ ఇన్ చార్జిలను తన సమీప బంధువులు, నమ్మిన బంట్లను సీఎం జగన్ నియమించారు. ఇప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు ఇదే పంథాను అనుసరించనున్నారు. నాలుగు ప్రాంతాల్లో తన బంధువులను బాధ్యులుగా నియమించనున్నారు.ఆర్థిక అవసరాల నుంచి క్యాంపెయిన్ల వరకూ అన్నీవారే చూడనున్నారు. రాయలసీమలో నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి చంద్రబాబు తన బావ మరిది నందమూరి బాలక్రిష్ణకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఆయన హిందూపురం శాసనసభ్యుడిగా ఉన్నారు. రాయలసీమ రాజకీయాలు ఆయనకు సుపరిచితం. పైగా నందమూరి అభిమానులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎన్నికు సంబంధించి బాధ్యతలను కల్లో కార్యోన్ముఖులను చేయనున్నారు.
లోకేష్ కు ఆ రెండు జిల్లాలు..
కృష్ణ, గుంటూరు జిల్లాల బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించనున్నారు. ఇప్పటికే ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పైగా టీడీపీకి సపోర్టుగా నిలిచే కమ్మ సామాజికవర్గం వారు ఆ రెండు జిల్లాల్లో అధికం. ఆ సామాజికవర్గంలో లోకేష్ కు పట్టు ఎక్కువ. దీనికితోడు తల్లి భువనేశ్వరి పుట్టిల్లు అది. రాజధాని మద్దతుగా ఉద్యమాలు, వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత, టీడీపీపై సానుకూలత ఉన్న జిల్లాలు కావడంతో ఆ రెండు జిల్లాల బాధ్యతలను చంద్రబాబు లోకేష్ కు అప్పగించారు.

రాజమండ్రి బరిలో రోహిత్
ఉభయ గోదావరి జిల్లాలతన సమీప బంధువులు, కుటుంబసభ్యులకు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నాయి. ఇప్పటికే రాజమండ్రి లోక్ సభ స్థానానికి తన తమ్ముడు కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ ను బరిలో దించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అదే జరిగితే ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతను నారా రోహిత్ కు అప్పగించే అవకాశముంది. పైగా జనసేనతో కలిసి పోటీచేసే అవకాశమున్న దృష్ట్యా అక్కడ కోఆర్డినేట్ చేసేందుకు మరో కుటుంబసభ్యుడ్ని నియమిస్తారని టాక్ నడుస్తోంది.
భరత్ కూ బాధ్యతలు..
ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల బాధ్యతను గీతంవిద్యాసంస్థల అధినేత భరత్ కు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. ఆయన స్వయాన లోకేష్ కు తోడల్లుడు. పైగా నందమూరి బాలకృష్ణకు చిన్న అల్లుడు. ఇప్పటివరకూ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలను ఎంవీవీఎస్ మూర్తి చూసుకునేవారు. ఇప్పుడు ఆ బాధ్యతలను ఆయన మనువడు భరత్ కు అప్పగించనున్నారు. మొత్తానికైతే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బాధ్యతలను బంధువులకు అప్పగించనున్నారన్న మాట.