
టీడీపీ నేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి బీజేపీతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రోజురోజుకు బలపడుతోంది. భవిష్యత్తులో కూడా బీజేపీదే అధికారం అనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అయితే 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబు చేసిన కొన్ని తప్పులే బీజేపీ టీడీపీ మధ్య దూరం పెంచాయి.
Also Read : ప్రతిపక్షాలను డైవర్ట్ చేసేందుకేనా ఈ మంత్రుల కామెంట్స్
2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంలో బీజేపీ, జనసేన పార్టీల పాత్ర ఉంది. ఈ రెండు పార్టీలు మద్దతు ఇవ్వకపోయి ఉంటే 2014లోనే టీడీపీ ఓడిపొయేదని విశ్లేషకులు పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లు చంద్రబాబు బీజేపీతో సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి బీజేపీకి దూరమయ్యారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి విమర్శల పాలయ్యారు.
చివరకు కాంగ్రెస్ వల్ల టీడీపీకి ఎటువంటు ప్రయోజనం కలగలేదు. దీంతో చంద్రబాబు బీజేపీకి దగ్గర కావడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. మంత్రి నాని ప్రధాని మోదీ సతీసమేతంగా రామాలయానికి వెళ్లి భూమి పూజ చేసిన తర్వాత బీజేపీ నేతలు జగన్ కు సూచనలు చేస్తే బాగుంటుందని కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై చంద్రబాబు స్పందిస్తూ జగన్ ను ప్రశ్నిస్తే అందులోకి మోదీని లాగడమేంటని అన్నారు.
తిరుమల ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి సతీసమేతంగా రావాల్సి ఉంటుందని.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మోదీపై కామెంట్లు చేయడం ఏమిటని మండిపడ్డారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు చర్చీలు, మసీదులపై కూడా జరిగితే ఊరుకుంటారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీకి, మోదీకి అనుకూలంగా కామెంట్లు చేస్తూ ఆ పార్టీకి దగ్గర కావాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.
Also Read : ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి సీనియర్లకు ఇవ్వరట!