https://oktelugu.com/

Chandrababu will Gives 40 Percent Tickets To Youth: యువతకే టికెట్లు.. చంద్రబాబు ప్లాన్ ఏంటి?

Chandrababu will Give 40 Percent Tickets To Youth: తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చుకుంది. యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలకు ఉద్భోద చేశారు. యువతతోనే ఏదైనా సాధ్యమని గుర్తించారు. దీని కోసమే వారికి నలభై శాతం టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో యువతలో ఉత్సాహం పెరుగుతోంది. యువత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం సేవ చేయాలని అభ్యర్థించారు. దీంతో టీడీపీ అనుసరిస్తున్న వైఖరి […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 30, 2022 / 09:07 AM IST
    Follow us on

    Chandrababu will Give 40 Percent Tickets To Youth: తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చుకుంది. యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలకు ఉద్భోద చేశారు. యువతతోనే ఏదైనా సాధ్యమని గుర్తించారు. దీని కోసమే వారికి నలభై శాతం టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో యువతలో ఉత్సాహం పెరుగుతోంది. యువత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం సేవ చేయాలని అభ్యర్థించారు. దీంతో టీడీపీ అనుసరిస్తున్న వైఖరి పార్టీకి ప్లస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

    Chandrababu

    యువత టీడీపీలో చేరి తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని సూచిస్తున్నారు. రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది ఇందు కోసమే యువత రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇన్నాళ్లు వృద్ధ నేతలతోనే పార్టీ నడిచినా ప్రస్తుతం యువత అవసరం ఉందని తెలుసుకున్నారు. అందుకే యువతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బాబు ముందుకొచ్చారు. దీంతో యువతను తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

    Also Read: AP Cabinet Expansion Date Fixed: కేబినెట్ విస్తరణ ముహూర్తం ఈనెల 11కు జగన్ ఫిక్స్ అయ్యారా?

    గత ఎన్నికల్లో వైసీపీకూడా యువతకు పెద్దపీట వేయడంతోనే విజయం సాధించిందని తెలుసుకున్న చంద్రబాబు కూడా అదే మంత్రాన్ని వేయనున్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతల వారసులు కూడా చాలా మంది యువత సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వారిని ఉపయోగించుకుని పార్టీని విజయపథంలో నడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కష్టపడే యువతకు అవకాశాలు కల్పించి వారికి పదవులు ఇవ్వాలని చంద్రబాబు ముందుకు రావడం నిజంగా ఆశావహమే.

    Chandrababu

    యువ నాయకత్వ లోపంతోనే పార్టీ నిర్వీర్యం అవుతోందని గుర్తిస్తున్నారు. అందుకే యువత అవసరం ఉందని తేల్చేస్తున్నారు. చంద్రబాబు ప్రకటనతో యువ నేతల్లో ఆశాకిరణాలు పెరుగుతున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలతో యువత పార్టీలో చేరడానికి ముందుకొస్తోంది. పార్టీ కోసం పనిచేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపి పార్టీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. దీంతో భవిష్యత్ ఇక బాబుదే అనే భరోసా నేతల్లో కనిపిస్తోంది.

    Also Read: CM Jagan Gets Negative Review: జగన్ కు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరా?

    Tags