https://oktelugu.com/

Chandrababu : వేణు స్వామి చెప్పినట్టే చంద్రబాబు జైలుకు.. అధికారం కష్టమేనట!

వేణుస్వామి అప్పుడు అన్న మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2023 / 07:51 PM IST

    chandrababu

    Follow us on

    Chandrababu : ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యరాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం స‌ృష్టించారు. వీరితోపాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ కావడంతో తాజాగా మూడేళ్ల కిందట ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతకం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి జోస్యం అక్షరాల నిజమైందని పాత వీడియోను అందరూ ప్రస్తావిస్తున్నారు.

    -బాబు జాతకం ఇలా..
    ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్‌ చంద్రబాబు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘చంద్రబాబు కచ్చితంగా సమస్యల బారిన పడతారు. వందకు వందశాతం ఆయన సమస్యల బారిన పడతారు. చంద్రబాబుకు 2024 వరకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోంది. 2024లో చంద్రబాబు గెలవటం కష్టం. ఏ రెమిడీ తీసుకున్నా.. సబ్జెక్ట్‌ చెయ్యి దాటి పోయింది’ అని అన్నారు. వేణుస్వామి అప్పుడు అన్న మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు.

    -కేసీఆర్‌ కూడా ఖతమేనా..
    ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇద్దరి జాతకాలు ఒకేలా ఉన్నాయని వేణుస్వామి తెలిపారు. ఇద్దరిదీ కర్కాటక రాశి అని., 2022 ఆగస్టు తర్వాత ఇద్దరి జాతకాల్లోకి అష్టమ శని ప్రవేశిస్తుందని తెలిపారు. దీంతో అనారోగ్యం, న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు. 30 ఏళ్ల క్రితం ఎదుర్కొన‍్న ఇబ్బందులే మళ్లీ పునరావృతం అవుతాయని వెల్లడించారు. దీంతో కేసీఆర్‌ కూడా త్వరలోనే సమస్యలు ఎదుర్కొంటారా అన్న చర్చ జరుగుతోంది.