UPI transaction : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్…అదేనండి ఇప్పుడు పేమెంట్ కోసం ప్రతి ఒక్కరు వాడే యూపీఐ.. మనకు ఎంత సౌలభంగా ఉంటుందో ఒక్కొక్కసారి కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపించినప్పుడు తిరిగి వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ శాతం ఇలా ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరుగుతుంది.
తప్పు పని చేయడానికి అలాగే చెల్లింపులు చేయడానికి ఇది ఎంతో సులభతరమైన మార్గం కావడంతో కూరగాయల కొట్టు దగ్గర నుంచి సూపర్ మార్కెట్ వరకు ప్రతి దగ్గర దీని వాడకం ఎక్కువగా ఉంది. అయితే కొన్ని సమయాలలో ప్రమాదవశాత్తు లేక హడావిడిలోనే.. మనం పంపవలసిన వారికి కాక వేరే నెంబర్ కి డబ్బు పంపించడం జరుగుతుంది. అలాంటి సందర్భాలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ రివర్స్ చేసే అవకాశం ఉంది. మరి అది ఎలా చేయాలి తెలుసుకుందాం.
యూపీఐ ద్వారా డబ్బులు వేరే వారి అకౌంట్ కి పంపి ఇబ్బందులు పడే వారికి పరిష్కార మార్గం కల్పించడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) “UPI ఆటో-రివర్సల్” విధానాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని నేర్పిస్తా పరిస్థితులలో వారు ఇచ్చిన సూచనల మేరకు.. మీరు మీ యూపీఐ సేవలను “ఆటో-రివర్సల్”చేసుకుని వసతి ఉంటుంది.
ఇంతకీ యూపీఐ లావాదేవీని ఎలా రివర్స్ చేయాలి అంటే…తప్పుగా ఏదైనా మొబైల్ నెంబర్ కు లేక యూపీఐ ఐడి కి డబ్బు పంపితే…మీరు రివర్స్ కోసం అభ్యర్థించవచ్చు. మీరు ఆథరైజ్ చేయనటువంటి ఏదన్నా ట్రాన్సాక్షన్ జరిగినట్టు మీరు గమనించినట్లయితే వెంటనే మీ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ కు ఈ విషయాన్ని తెలియపరచి ట్రాన్సాక్షన్స్ను రివర్స్ చేయడానికి అభ్యర్థించవచ్చు. ఇక ముఖ్యంగా మీరు పెండింగ్ లేదా ఫెయిల్ అయినటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే రివర్స్ చేయగలుగుతారు కానీ పూర్తి అయిన ట్రాన్సాక్షన్స్ రివర్స్ చేయడం కుదరదు.
ఒక్కసారి సక్సెస్ఫుల్ అయినటువంటి ట్రాన్సాక్షన్ తిరిగి వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి ట్రాన్సాక్షన్ చేయడానికి ముందే అన్ని డీటెయిల్స్ ను పూర్తిగా చెక్ చేసుకోవడం మంచిది. ఈ పైన చెప్పిన అన్ని షరతులను దృష్టిలో పెట్టుకొని మీరు మీ యూపీఐ లావాదేవిలను రివర్స్ కోసం అభ్యర్థించవచ్చు.