గతంలో కూడా విశాఖ ఉక్కును పరిరక్షించుకున్నామని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు స్టీల్ ప్లాంటులో వంద శాతం ప్రైవేటీకరణ జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. సీఎం జగన్ విశాఖ ఉక్కు కోసం మంత్రికి లేఖలు రాశారు. కేంద్రం ప్రైవేటీకరించకుండా ఉండేందుకు అఖిలపక్ష నేతలతో చర్చించాలని సూచించారు. ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్నితగ్గించేందుకు ఇరు పార్టీలు తగినంత నమ్మకం కలిగించేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ర్ట ప్రయోజనాలు కాపాడేందుకు వైసీపీ, టీడీపీ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా జగన్ పై ఒత్తిడి పెంచేందుకు సరైన సమయం కోసం చూసిన బాబుకు స్టీల్ ప్లాంట్ అంశం కలిసొచ్చే లా ఉందని భావించి ముందుకు కదిలారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి తమ మద్దతు ప్రకటించారు.
చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు వైసీపీ నుంచి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ ముందుండి నడిపిస్తే విశాఖ ఉక్కు కోసం పోరాడేందుకు సిద్ధమని చెబుతూ చంద్రబాబు చేసిన సవాలుకు వైసీపీ నేతలు సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మొత్తానికి టీడీపీ తీరుతో వైసీపీ కూడా ప్రస్తుతం తన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఏర్పడింది.