Chandrababu Naidu: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పోటీ చేయించేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీవ్యూహాత్మక మౌనం పాటిస్తుందని అందరూ భావించారు.కానీ చంద్రబాబు మాత్రం తనదైన రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ బరిలో ఉంటుందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తేల్చి చెప్పడంతో రేవంత్ అశలు నీరుగారిపోయాయి.
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో పార్టీ నిర్వీర్యం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారినా రేవంత్ రెడ్డి చంద్రబాబు విషయంలో సానుకూల దృక్పథంతోనే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆశీస్సులతోనే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎదిగారన్న ప్రచారం ఒకటి ఉంది. రేవంత్ కాంగ్రెస్ లో చేరినా ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఎనలేని ప్రాధాన్యం చూపిస్తూ వస్తోంది. తాజాగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వారాంతపు కామెంట్స్ లో టిడిపి తెలంగాణలో పోటీ చేయకుండా ఉండడమే మేలని తన కాలమ్ లో రాసుకొచ్చారు. కానీ పోటీ చేస్తామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించడం విశేషం. పైగా ఆర్కే రాతలను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానించడం విస్తు గల్పుతోంది.
ప్రస్తుతం చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబుకు మంచి రోజులు వచ్చినట్టెనని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ భావిస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండాఉండడమే ఉత్తమమని భావిస్తున్నారు. అప్పుడే సెటిలర్స్ తో పాటు కమ్మ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి టర్న్ అవుతాయని భావిస్తున్నారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలదని బలంగా విశ్వసిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇవేవీ పట్టించుకోకుండా తెలంగాణ ఎన్నికల్లో బరిలో దిగుతామని ప్రకటించడం విశేషం.
తాజాగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. తప్పకుండా తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలో దిగుతుందని ప్రకటించారు. కొన్ని మీడియా సంస్థలు తమ తప్పుదారి పట్టిస్తున్నాయని పరోక్షంగా ఆంధ్రజ్యోతి గురించి ప్రస్తావించారు. ఇటీవల వారాంతపు కాలమ్ లో తెలంగాణలో పోటీ చేయవద్దని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి సూచించారు. కానీ తమ పార్టీ తప్పకుండా బరిలో దిగుతుందని ప్రకటించడం ద్వారా ఆర్కే కు కాసాని జ్ఞానేశ్వర్ ట్విస్ట్ ఇచ్చారు. చంద్రబాబు అనుమతి లేనిదే జ్ఞానేశ్వర్ ఇటువంటి ప్రకటన చేయడానికి సాహసించరు. మొత్తానికైతే అటు రేవంత్ రెడ్డి తో పాటు, ఇటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు ఝలక్ ఇచ్చినట్లు అయింది.