KCR Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. దసరా సందర్భంగా విజయవాడ దుర్గమ్మ దర్శననానికి సతీసమేతంగా వచ్చారు చంద్రబాబు. ఈ సందర్భంగా పూజలుపునస్కారాలు చేసి అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చారు. ఆ పోరాటం ముందుకు తీసుకెళతామన్నారు. అంతా బాగానే ఉన్న చంద్రబాబు ను ‘కేసీఆర్ జాతీయ పార్టీపై’ స్పందించాలని విలేకరులు ప్రశ్నించారు. దానికి చంద్రబాబు స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు సైతం గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని.. మోడీని ఓడించాలని కంకణం కట్టుకొని పనిచేశారు. కానీ చంద్రబాబు ఏపీలో దారుణంగా ఓడిపోయి.. అధికారం కోల్పోయి అగచాట్లు పడ్డారు. తనలాంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబుతోనే మోడీని ఓడించడం కాలేదు. ఇక మోడీతో సమకాలీకుడు చంద్రబాబు. ఆయననే సక్సెస్ కాలేకపోయారు. మరి కేసీఆర్ తో అవుతుందా? అంటే ఆయనలో ‘నవ్వు ’ తన్నుకొచ్చింది. ఓ నవ్వు నవ్వి ఊరుకోవడం వెనుక కారణం అదే.. కేసీఆర్ జాతీయ పార్టీని ఓ జోక్ గా చంద్రబాబు అభివర్ణించినట్టున్నారు.
చంద్రబాబు రియాక్షన్ చూస్తే.. కేసీఆర్ తో జాతీయ రాజకీయాలు ఏవీ కావని ఆయన నవ్వును బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు శిష్యుడే కేసీఆర్. గురువును మించిన శిష్యుడిగా కేసీఆర్ అవుతాడా? అంటే ఆయనకు డౌట్ ఉన్నట్టుంది. అందుకే నవ్వు నవ్వి ఊరుకున్నారు. చంద్రబాబు నేరుగా స్పందించకపోవడానికి కారణం కూడా అదేనంటున్నారు. కాలమే దీనికి సమాధానం చెబుతుందన్నట్టుగా చంద్రబాబు స్పందనను బట్టి తెలుస్తోంది.
[…] Also Read:KCR Chandrababu: హాట్ రియాక్షన్: కేసీఆర్ జాతీయ ప… […]