https://oktelugu.com/

Chandrababu Pawan Kalyan: ఒక్క ఫోన్ కాల్ తో శత్రువు (చంద్రబాబు)- శత్రువు (పవన్ కళ్యాణ్)ను కలిపిన జగన్

chandrababu Phone call to pawan kalyan: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మూడు ముక్కలాట నడుస్తోంది. తెలంగాణలో అయితే టీఆర్ఎస్ లేదంటే బీజేపీ అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ అంత బలంగా లేదు. కానీ ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీతో ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ ముగ్గురి సంకుల సమరంతో ఏపీ అట్టుడుకుతోంది. ఈ మూడు పార్టీలో విశాఖలో ఒకే రోజు మూడు ప్రోగ్రాంలు పెట్టడంతో ప్రశాంత విశాఖ ఉద్రిక్తతలతో ఆగమాగమైంది. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2022 7:57 pm
    Follow us on

    chandrababu Phone call to pawan kalyan: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మూడు ముక్కలాట నడుస్తోంది. తెలంగాణలో అయితే టీఆర్ఎస్ లేదంటే బీజేపీ అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ అంత బలంగా లేదు. కానీ ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీతో ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ ముగ్గురి సంకుల సమరంతో ఏపీ అట్టుడుకుతోంది. ఈ మూడు పార్టీలో విశాఖలో ఒకే రోజు మూడు ప్రోగ్రాంలు పెట్టడంతో ప్రశాంత విశాఖ ఉద్రిక్తతలతో ఆగమాగమైంది.

    అయితే పవన్ కల్యాణ్ ను అడ్డుకొని.. పోలీసులతో వేధించి వైసీపీ అధినేత, సీఎం జగన్ పెద్ద తప్పు చేశారని.. తన గొయ్యి తనే తవ్వుకున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ ను స్వేచ్ఛగా వదిలేస్తే ఆయన మానాన ఆయన ‘జనవాణి’ నిర్వహించుకొని వెళ్లిపోయేవారు. కానీ ఆయన కార్యక్రమాన్ని జరగనీయకుండా పోలీసులతో అడ్డుకొని పవన్ టూర్ కు బాగా మైలేజ్ కల్పించిన ఘనత ఖచ్చితంగా జగన్ దే. ఏ తప్పు అయితే చేయకూడదో అదే చేశాడు. పవన్ దాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రజల్లో హీరో అయిపోయాడు.

    ఇక విశాఖ టూర్ ద్వారా జగన్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఇద్దరు శత్రువులను మిత్రులుగా చేయడం అవును. ఇన్నాళ్లు రాజకీయ విభేదాలతో కాస్తా దూరంగానే ఉన్న టీడీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ లను జగన్ ఒక్కటి చేశారు. పవన్ కళ్యాణ్ ను విశాఖలో పోలీసులతో నిర్బంధించి ఇబ్బంది పెట్టడంతో పవన్ పై సానుభూతి వెల్లివిరిసింది. ప్రజల్లో మంచి ఫెయిత్ పవన్ కు వచ్చింది. ఇలా ఒక పార్టీ అధినేతను హింసించిన జగన్ జనాల్లో విలన్ అయిపోయాడు.

    అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో పాపులారిటీ ప్రతిపక్ష నేతల నుంచి మద్దతు దక్కడం విశేషం. ఈ క్రమంలోనే విశాఖలో వైసీపీ సర్కార్ ధాటికి బాధితుడిగా మారిన పవన్ కు తాజాగా చంద్రబాబు ఫోన్ చేశారు. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై మాట్లాడారు. ప్రతిపక్ష నేతల పర్యటనకు అడ్డంకులు సరికాదని.. వందలమంది జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు పవన్ కు ఉందన్నారు. పోలీసులతో జగన్ పాలిస్తున్నారని పవన్ తో మాట్లాడుతూ అన్నారు.ఇక తనకు నోటీసులు,నేతల అరెస్ట్ ల గురించి చంద్రబాబుకు పవన్ వివరించారు.

    మొత్తంగా ఇన్నాళ్లు కాస్త గ్యాప్ తో దూరంగా ఉన్న చంద్రబాబు, పవన్ లను విశాఖలో నిర్బంధ చర్యలతో జగనే కలిపారు. వీరిద్దరూ కనుక జగన్ ను ఎదురించడానికి నిజంగా ఈ స్నేహాన్ని కంటిన్యూ చేస్తే జగన్ ను తిప్పలు తప్పవు. 2024లో ఖచ్చితంగా అధికారం పవన్, చంద్రబాబులదే అవుతోంది. విశాఖ చర్యతో వారిని కలిపిన ఘనత మాత్రం జగన్ కే దక్కుతుంది. తన ఓటమికి తానే గొయ్యి తీసుకున్న చందంగా జగన్ ఈ రాంగ్ స్టెప్ వేసినట్టుగా తెలుస్తోంది.