Vishwak Sen Pawan Kalyan: తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగు లో ‘ఓరి దేవుడా’ అనే పేరు తో రీమేక్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇందులో విశ్వక్ సేన్ మరియు మిథిలా పాల్కర్ హీరో హీరోయిన్లు గా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అక్టోబర్ 21వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు రాజముండ్రి లో ఘనంగా జరిగింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు..రామ్ చరణ్ హాజరు కావడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ని ఉద్దేశించి రామ్ చరణ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘విశ్వక్ సేన్ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం..ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఆయన మంచి క్రేజ్ ని సంపాదించాడు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ ని సాధించే హీరోలంటే మాకు చాలా ఇష్టం..ఎందుకంటే మా నాన్న గారు అలాగే పైకి వచ్చారు..ఆ కష్టం విలువ తెలుసు..ఎంత పైకి వచ్చిన ఒక హీరో కి క్యారక్టర్ అనేది చాలా ముఖ్యం..హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులు విపరీతంగా ఒక హీరోతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేది క్యారక్టర్ ని చూసే..దానికి ఉదాహరణగా రజినీకాంత్ , చిరంజీవి , పవన్ కళ్యాణ్ లను చూపించొచ్చు..విశ్వక్ సేన్ కూడా వాళ్ళ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇక ఈ సినిమా లో వెంకటేష్ గారు ముఖ్య పాత్ర పోషించాడని తెలిసింది..ఆయన కోసమైనా ఈ సినిమాని నేను కచ్చితంగా చూస్తాను..ఇక హీరోయిన్ మిథుల్ పాల్కల్ OTT లో పెద్ద సూపర్ స్టార్..ఆమె నటించిన వెబ్ సిరీస్ లకు నేను ఉపాసన పెద్ద అభిమానులం’ అంటూ రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.మొత్తంగా విశ్వక్ సేన్ ను భవిష్యత్ పవన్ కళ్యాణ్ గా రాంచరణ్ పోల్చడం ఇప్పుడు వైరల్ అవుతోంది.