https://oktelugu.com/

పవన్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ అవుట్ ఫుట్ బాగా రాలేదా.. ఇండస్ట్రీ జనం మాటల్లో మాత్రం కొంచెం అవుట్ ఫుట్ అటు ఇటుగానే ఉందని.. మొత్తానికి పవన్ పై కొన్ని రెగ్యులర్ సీన్స్ వర్కౌట్ అయ్యేలా లేవని, ఇప్పటికే దిల్ రాజు ఆ సీన్స్ ను సినిమా నుండి తీసి వేయాలనే ఆలోచనలో ఉన్నాడని ఇలా తాజాగా వకీల్ సాబ్ గురించి కాస్త బయట బ్యాడ్ టాక్ […]

Written By:
  • admin
  • , Updated On : August 12, 2020 / 03:48 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ అవుట్ ఫుట్ బాగా రాలేదా.. ఇండస్ట్రీ జనం మాటల్లో మాత్రం కొంచెం అవుట్ ఫుట్ అటు ఇటుగానే ఉందని.. మొత్తానికి పవన్ పై కొన్ని రెగ్యులర్ సీన్స్ వర్కౌట్ అయ్యేలా లేవని, ఇప్పటికే దిల్ రాజు ఆ సీన్స్ ను సినిమా నుండి తీసి వేయాలనే ఆలోచనలో ఉన్నాడని ఇలా తాజాగా వకీల్ సాబ్ గురించి కాస్త బయట బ్యాడ్ టాక్ నడుస్తోంది. ఒకపక్క ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైంలో ఇలాంటి టాక్ రావడం అనేది పవన్ ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరచడమే. ఏది ఏమైనా ఈ సారి కూడా పవన్ హిట్ కొట్టలేక పోతే అది ఫ్యాన్స్ కి పర్సనల్ గా తీవ్ర నిరాశే.

    Also Read: పెళ్లి చేసుకునే లోపే ఛాన్స్ లు ఇచ్చేయండి !

    పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి.. ఇక పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడం గ్యారంటీ అని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటూ ఓ రేంజ్ లో హడావుడి చేశారు. ఇప్పుడు చూస్తే అసలుకే మోసం వచ్చేలా ఉంది. వకీల్ సాబ్ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్న పవన్ ఫ్యాన్సే అవుట్ ఫుట్ తేడా వస్తే సినిమాని పక్కన పెట్టేస్తారు. నిజానికి పింక్ సబ్జెక్టులోనే పక్కా కమర్షియల్ అంశాలు ఉండవు. పైగా పవన్ ఇదివరకు చేసినట్లు డాన్స్ లు అండ్ రొమాన్స్ చేసే పరిస్థితి లేదు. అలాగే కాస్త మోతాదుకు మించి యాక్షన్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ రెడీగా లేడు.

    Also Read: బాలయ్య ముందు మార్కెట్ పెంచుకో !

    మరి వీటన్నిటి మధ్యలో అవుట్ ఫుట్ బాగా రాలేదు అంటే.. ఇక ఈ సినిమా పై ఉన్న నమ్మకం పోవడమే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. కాకపోతే కరోనా కరుణించాలి. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో పవన్ కమ్ బ్యాక్ ఎలా అయ్యారో, అలా వకీల్ సాబ్ తో మళ్ళీ కమ్ బ్యాక్ అవుతాడని పెట్టుకున్న బాక్సాపీస్ ఆశలు పై ఇక ఆల్ మోస్ట్ చిత్రబృందం ఇప్పటికే ఆ ఆశలు వదిలేసుకుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు. పవన్ ఫ్యాన్స్ ఇక నుండి ఈ సినిమా పై మీ గురి పెట్టుకోండి.