Chandrababu Kadapa Tour: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. పార్టీలు తమ ప్రచారం కోసం పాకులాడుతున్నాయి. రాబోయే ఎన్నికల కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. పార్టీల మధ్య వ్యూహాలు కూడా కొత్త మార్గాల్లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. దీంతో పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. రెండు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు తమ వైపే ఉన్నారని వైసీపీ భావిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని టీడీపీ చెబుతోంది. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే పని అయిపోతుందా? వారి సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ పై లేదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. తమ కంటే ఇంకా బాగా ఎవరు చేయలేరనే ధీమా వైసీపీ వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రభావితం చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.
Also Read: AP Unemployment: ఉద్యోగాలెక్కడ జగనన్న.. ఏపీ సర్కారుపై నిరుద్యోగ యువత ఆగ్రహం
బుధవారం కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున రావడం సంచలనం కలిగిస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడం కల అని వైసీపీ చెబుతున్నా పరిస్థితి చూస్తుంటే టీడీపీ కూడా మెల్లగా తన ప్రభావం చూపించనుందని తెలుస్తోంది. కడపలో జనం రోడ్లపై తిరుగుతుంటే వారిని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. చంద్రబాబుకు మెల్లగా జనంలో ఫాలోయింగ్ పెరుగుతుందని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని మట్టి కరిపించాలని టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలు పర్యటిస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతోంది. చంద్రబాబు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో జిల్లాల్లో తిరుగుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ ఇస్తున్నారు. అధికార పార్టీ ప్రజలను ఎలా వంచిస్తుందో వివరిస్తున్నారు.

మొత్తానికి ఏపీలో చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. వైసీపీని ఎదుర్కోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కదులుతున్నారు. అందుకే జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలు తిరిగిన బాబు కడపకు చేరుకుని వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నారు. సో చంద్రబాబు కోరిక తీరుతుందా? వైసీపీని ఎదుర్కొంటారా? అనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. మొత్తానికి రాజకీయ వేడి రగులుతోంది. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది.
Recommended Videos:

[…] […]