https://oktelugu.com/

చంద్రబాబుకు మోడీ ఫోన్ …. ఉలిక్కి పడుతున్న జగన్!

సరిగ్గా రెండు సంవత్సరాల, ఒక నెల అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్ లో మాట్లాడడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాల నేతలతో కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ చంద్రబాబుతో కూడా, అది కూడా ఆయన చేసిన ఫోన్ కు సమాధానంగా మాట్లాడటం రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండదు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2020 / 03:02 PM IST
    Follow us on


    సరిగ్గా రెండు సంవత్సరాల, ఒక నెల అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్ లో మాట్లాడడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

    దాదాపు అన్ని రాజకీయ పక్షాల నేతలతో కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ చంద్రబాబుతో కూడా, అది కూడా ఆయన చేసిన ఫోన్ కు సమాధానంగా మాట్లాడటం రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండదు.

    అయితే ఈ టెలిఫోన్ సంభాషణ గురించి వైసిపి నేత విజయసాయిరెడ్డి స్పందించిన తీరు గమనిస్తే వైసిపి అధినేత అబద్రతాభావంకు గురవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

    2018లో మార్చ్ 8న ఇదే విధంగా అంతకు ముందు చంద్రబాబు చేసిన ఫోన్ కు అందుబాటులో లేని ప్రధాని మోదీ చంద్రబాబుకు ఫోన్ చేసారు. ఆ సందర్భంగా తమ మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రివర్గం నుండి నిష్క్రమిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత కొద్దీ రోజులకే ఎన్డీయే నుండి టిడిపి వైదిలొగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా చంద్రబాబు ప్రధానిని కలుసుకోవడం గాని, కనీసం మాట్లాడటం గాని జరగలేదు.

    ఇప్పుడు కూడా కరోనా గురించి తాను సేకరించిన సమాచారం కొంత ఇవ్వడం కోసం చంద్రబాబు ఫోన్ చేస్తే అందుబాటులో లేని ప్రధాని, ఆ మరుసటి రోజు ఉదయం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ విషయాన్నీ చంద్రబాబు స్వయంగా మీడియాకు తెలిపారు. ప్రధాని వైపు నుండి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

    ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా తాను కొన్ని సూచనలు ఇస్తున్నానని అంటూ, ఈ సూచనలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా గత వారం విశేషంగా ప్రచారం పొందిన దేశాన్ని మూడు విభాగాలుగా – రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఎల్లో జోన్ – అంటూ విడదీయడం తన ఆలోచన అన్నట్లుగా కూడా చెప్పారు అనుకోండి.

    ఈ టెలిఫోన్ సంభాషణని అవహేళన చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పాతికసార్లు ప్రాధేయ పడితే ప్రధాని నరేంద్ర మోదీ కాల్ చేసి ఉంటారని అంటూ ధ్వజమెత్తారు. పైగా, మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా కాల్‌ చేసి మాట్లాడారని గుర్తు చేశారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు .

    ఆ ట్వీటీపై టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ..చంద్రబాబుకు ఫోన్‌ చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి దుస్తులు ఎందుకు చించుకుంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు.

    పైగా, ఎన్నికల ముందు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ జగన్‌ ఊరేగారు, ఫ్రంట్‌ గెలిస్తే జగనే ఉప ప్రధాని అంటూ మీరు ఇచ్చిన బిల్డప్‌ మర్చిపోయారా? అని ఆయన ఎద్దేవా చేశారు.

    ‘‘ఎంపీలను గెలిపించండి..మోదీ మెడలు వంచుతాం.. అని..ప్రజలు ఓట్లేసిన తర్వాత పోటీపడి మరీ..మోదీ కాళ్ల మీద జగన్‌ పడిన విషయం గుర్తులేకపోతే ఎలా?.. విజయసాయిరెడ్డి ..’’ అని అవహేళన చేశారు.