https://oktelugu.com/

ఒప్పుకోని కుప్పం.. మేలుకున్న బాబు

ఏపీలో పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. అధికార పార్టీ ప్రతిక్షాల కన్నా.. అధికార వైసీపీ.. ఎన్నికల కమిషన్ మధ్య తీవ్రమైన పోటీ సాగింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీడీపీని నిలువుగా ముంచాయి. అసలు రాష్ట్రం అనేది పక్కన పెడితే… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వస్థలం కుప్పంలో టీడీపీ ఘోరం ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆ ఓటమి చంద్రబాబు కళ్లు తెరిపించింది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 28, 2021 5:00 pm
    Follow us on

    Chandrababu
    ఏపీలో పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. అధికార పార్టీ ప్రతిక్షాల కన్నా.. అధికార వైసీపీ.. ఎన్నికల కమిషన్ మధ్య తీవ్రమైన పోటీ సాగింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీడీపీని నిలువుగా ముంచాయి. అసలు రాష్ట్రం అనేది పక్కన పెడితే… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వస్థలం కుప్పంలో టీడీపీ ఘోరం ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆ ఓటమి చంద్రబాబు కళ్లు తెరిపించింది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికలు చంద్రబాబుకు తీవ్ర మనో వేదనను మిగిల్చాయి.

    Also Read: భూకంప ప్రచారం.. ప్రజల చివాట్లు..

    చంద్రబాబు ప్రతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఏకంగా 89 పంచాయతీల్లో 74 వైపీసీ.. కైవసం చేసుకుంది. టీడీపీ మద్దతుదారులు కేవలం 14చోట్లకే పరిమితం అయ్యారు. ఈ అంశాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. కుప్పంలో టీడీపీ మద్దతుదారులు ఘోరం ఓడిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికార పార్టీ పై విమర్శ అస్త్రాలు సంధించడానికి సిద్ధం అయ్యారు.

    Also Read: విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి కేసులో సంచలన ట్విస్ట్

    ఒక సమయంలో అధికార పార్టీ నేతల విమర్శలకు తట్టుకోలేక.. తండ్రీ కొడుకులు బూతులకు పాల్పడ్డారు. వైసీపీ దౌర్జన్యాలు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని.. అలాగే సంక్షేమ పథకాలను కట్ చేస్తామని భయపెట్టారని దీంతో తమ మద్దతు దారులు ఓటమి పాలయ్యారని కుప్పం పర్యటనకు ముందు చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తేలిసిందే..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఆ తరువాత కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులు చంద్రబాబు నాయుడు పర్యటించారు. పర్యటన ముగింపు సందర్భంగా ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రూపు రాజకీయాల కారణంగానే కుప్పంలో పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపిజం వదిలిపెట్టి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులు ఓటమిపాలు కావడానికి పార్టీలో గ్రూపు రాజకీయాలే కారణం అని చంద్రబాబు అంగీకరించారు. కనీసం పార్టీ శ్రేణుల ఎదుటైనా వాస్తవాలు మాట్లాడారు. నిజం నిలకడ మీదకు తెస్తుందటే.. ఇదేనేమో…