https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. రేపటినుంచే తెలంగాణకు బస్సులు..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల మార్చి నెల చివరి వారం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం కొన్ని నెలల క్రితమే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతులు ఇచ్చినా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సులు నడవలేదు. సమస్య పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల అధికారులు పలు సందర్భాల్లో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. అయితే ఎట్టకేలకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 2, 2020 11:45 am
    Follow us on

    Interstate Transport AP-TS
    కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల మార్చి నెల చివరి వారం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం కొన్ని నెలల క్రితమే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతులు ఇచ్చినా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సులు నడవలేదు. సమస్య పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల అధికారులు పలు సందర్భాల్లో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. అయితే ఎట్టకేలకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి.

    Also Read: విజయవాడపై కొత్త ప్రతిపాదన ఇదీ

    ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు ఏయే మార్గాల్లో ఎన్ని బస్సులు నడపాలనే అంశం గురించి స్పష్టత వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థల ఎండీలు తెలంగాణ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఎంవోయూపై సంతకాలు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి లేదా రేపటినుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    గతంలో ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణకు 1,099 సర్వీసులను నడపగా ఇప్పుడు ఆ సంఖ్య 638కు చేరింది టీఎస్సార్టీసీ గతంలో 750 సర్వీసులు నడపగా ఆ సంఖ్యను 820కు పెంచుకుంది. ఇరు రాష్ట్రాలు 1,61,000 కిలోమీటర్ల మేరకు బస్సులు నడపటానికి ఒప్పందం చేసుకోనున్నాయి. భవిష్యత్తులో అవసరమైతే ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించుకుని సమన్యాయం ప్రాతిపదికన కిలోమీటర్లను పెంచుకోనున్నాయని తెలుస్తోంది.

    Also Read: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వాళ్లకు రూ. 10 వేలు జమ..!

    ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చాలాకాలంగా ఇరు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ప్రజారవాణా ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏపీ నుంచి హైదరాబాద్ కు ఎక్కువగా వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్