Chandrababu Jail: నవంబర్ 20 వరకు జైల్లో చంద్రబాబు.. కారణం అదే

ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాల అవినీతిపై న్యాయస్థానాలు సీరియస్ గా ఉన్న సమయం ఇది. ఎటువంటి ఆధారాలు లేకుండా.. రాజకీయ కక్షపూరితంగా ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తేనే న్యాయస్థానాలు బాధిత పక్షానికి అనుకూలంగా తీర్పులను ఇస్తున్నాయి.

Written By: Dharma, Updated On : October 22, 2023 12:17 pm

Chandrababu

Follow us on

Chandrababu Jail: స్కిల్ స్కాం కేసు నుంచి చంద్రబాబు ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం సెక్షన్ 17 ఏను మాత్రమే ఆయన నమ్ముకున్నారు. కేవలం తనను అరెస్టు చేసే విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నదే ప్రధాన అంశంగా ఎంచుకున్నారు. దాని చుట్టూ మాత్రమే వాదనలు వినిపిస్తున్నారు. అయితే అదే 17a సెక్షన్ అవినీతిపరులకు అస్త్రం కాకూడదు అన్నదానిపై విస్తృత చర్చ నడుస్తోంది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 17 ఏ సెక్షన్ సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాల అవినీతిపై న్యాయస్థానాలు సీరియస్ గా ఉన్న సమయం ఇది. ఎటువంటి ఆధారాలు లేకుండా.. రాజకీయ కక్షపూరితంగా ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తేనే న్యాయస్థానాలు బాధిత పక్షానికి అనుకూలంగా తీర్పులను ఇస్తున్నాయి. కానీ చంద్రబాబు కేసు విషయంలో స్పష్టమైన ఆధారాలు సిఐడి వద్ద ఉన్నాయి. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈడీ కేసులు నమోదు చేసింది. కొంతమందిని అరెస్టు కూడా చేసింది. ఆ సమయంలో ప్రభుత్వ అధినేతగా ఉన్న చంద్రబాబు కేసుల విచారణను ముందుకు తీసుకెళ్లలేదు. ఇక్కడే చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. కేసును తొక్కి పెట్టారన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఇప్పుడు అదే ప్రతిబంధకంగా మారింది.

చంద్రబాబు 17a సెక్షన్ ను నమ్ముకోవడం సహేతుకమే అయినా.. సాహసం కూడా. 17a సెక్షన్ విషయంలో కర్ణాటకలో డీకే శివకుమార్ కు చుక్కెదురు అయ్యింది. సుప్రీంకోర్టులో మాత్రం యడ్యూరప్పకు ఉపశమనం దక్కింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అయితే సుప్రీంకోర్టులో లోతైన విచారణ జరగడం మాత్రం కొత్త సంకేతాలను ఇస్తోంది. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్ట్.. బయటకు వెల్లడించడానికి సమయం తీసుకుంది. ఏదైనా కేసు విచారణలో వాయిదాలు కొనసాగడం మాత్రం పిటీషనర్ కి అనుకూలత తగ్గిపోవడమే. ఇప్పుడు చంద్రబాబు కేసు విషయంలో సైతం అదే అనుమానం ఉంది.

నవంబర్ 15 తర్వాత ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన 17 ఏ సెక్షన్ పిటీషన్ విచారణకు రానుంది. 17a సెక్షన్ సవరణ రాజ్యాంగ విరుద్ధమని.. దానిని రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ పొందుపరిచారు. ఇప్పుడదే 17a సెక్షన్ పాటించలేదని చంద్రబాబు వాదిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించకుండా జాప్యం చేస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రశాంత్ భూషణ్ పిటీషన్, చంద్రబాబు వాదనలు.. ఒకదానికొకటి లింక్ అయ్యాయి కాబట్టి.
.. ఆ పిటిషన్ విచారించి.. చంద్రబాబు కేసులో తీర్పు చెబుతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఎలా చూసుకున్నా.. వచ్చేనెల 20 వరకు చంద్రబాబు జైల్లో గడపాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.