Chandrababu: అనుకున్నట్టే అయ్యింది. టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవిని లాగి మరీ మరింత నిప్పు రాజేశారు. సినీ పరిశ్రమ మొత్తం తమ కులమే ఉందని.. తమకే అనుకూలం అన్న వాదనను చంద్రబాబు తప్పుపట్టారు. సినీ పరిశ్రమ తనకూ సహకరించింది లేదని చెప్పుకొచ్చి సంచలనం సృష్టించారు.

తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని.. అది కూడా తన ప్రభుత్వం ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా సినిమా చేశారని చంద్రబాబు ఉదాహరణలు వివరించారు. అయినా వాటిని తాను పెద్దగా పట్టించుకోలేదని చంద్రబాబు కవర్ చేశారు. ఇక సినీ పరిశ్రమ ప్రముఖులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని.. ఎవరితోనూ ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు.
ఇక చిరంజీవి సైతం తనకు వ్యతిరేకంగానే వ్యవహరించారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు.. పార్టీ పెట్టిన తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని.. అయితే రాజకీయంగా తనను వ్యతిరేకించినా తానెప్పుడు చిరంజీవిపై కోపం పెట్టుకోలేదన్నారు.
చిరంజీవి పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా తాను ఇబ్బందులు పడ్డా కూడా సఖ్యతగానే ఉన్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని అనవసరంగా లాగుతూ ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మొత్తానికి టీడీపీ భుజాలపై పెట్టి టాలీవుడ్ ను కాల్చాలనుకున్న జగన్ సర్కార్ తీరుకు చంద్రబాబు బయటకొచ్చి బాగానే కవర్ చేశాడు..