https://oktelugu.com/

కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షడు అనేవి ప్రస్తుతం చంద్రబాబుకు వున్న హోదాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పకొనే బాబు రాజకీయాలు మాత్రం కేవలం ఆంద్రప్రదేశ్ కే పరిమితం. ఎన్నికలు వచ్చే నాటికి గానీ ఆయనకు ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిని అనే మాట గుర్తుకురాదు. ఎదో ఒక వర్గం పక్షాన చేరి…ఎన్నికల సమయంలో ఢిల్లీ టూర్స్ వేయడం ఆయనకు అలవాటు. ఆయన ఢిల్లీ ప్రయాణాలను దేశ రాజకీయాలలో కీలక పరిణామాలుగా అనుకూల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 03:31 PM IST
    Follow us on


    ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షడు అనేవి ప్రస్తుతం చంద్రబాబుకు వున్న హోదాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పకొనే బాబు రాజకీయాలు మాత్రం కేవలం ఆంద్రప్రదేశ్ కే పరిమితం. ఎన్నికలు వచ్చే నాటికి గానీ ఆయనకు ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిని అనే మాట గుర్తుకురాదు. ఎదో ఒక వర్గం పక్షాన చేరి…ఎన్నికల సమయంలో ఢిల్లీ టూర్స్ వేయడం ఆయనకు అలవాటు. ఆయన ఢిల్లీ ప్రయాణాలను దేశ రాజకీయాలలో కీలక పరిణామాలుగా అనుకూల పత్రికలు ఊదరగొడుతూ ఉండేవి. గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ వ్యతిరేక కూటమితో జత కట్టి, మోడీకి సవాలు విసిరారు. కాంగ్రెస్ తో కూటమి గట్టిన మాయావతి, మమతా బెనర్జీ, కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ అందరూ బీజీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. బాబు మాత్రం మోడీ అధికారంలోకి రాగానే వెంటనే అనుకూల స్వర్యం అందుకున్నారు. ఆయనతో విభేదించకుండా ఉండాల్సింది అని మీడియా సాక్షిగా తప్పు చేశానని ఒప్పుకున్నారు.

    Also Read: ‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో ప్రభుత్వానికి షాక్..

    చంద్రబాబుది అవకాశవాద రాజకీయం అనడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. మోడీతో బాబు విభేదించడం వెనుక కారణం కూడా ప్రజల సానుభూతి కోసమే జరిగింది. ఐదేళ్ల పాలనలో ఇసుమంత అభివృద్ధి, సంక్షేమం జరిగిన దాఖలాలు లేవు. తన ఐదేళ్ల వైఫల్యాన్ని మోడీపై నెట్టేసి, తాను నిర్దోషిగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అది వర్క్ అవుట్ కాక ఓటమి చవిచూశారు. ఐతే జాతీయ పార్టీ నాయకుడిగా చెప్పుకొనే చంద్రబాబు పోరాటం ఆంధ్రప్రదేశ్ కే ఎందుకు పరిమితం అవుతుందనేది అసలు ప్రశ్న.

    Also Read: బాబు ఆవేశానికి తమ్ముళ్లు బలి కావాల్సిందేనా?

    కోవిడ్ నియంత్రణ, వైద్య సేవల విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేతల తాజా వాదన. వందల్లో మరణాలు సంభవిస్తున్నా పట్టించుకొనే నాధుడే లేడని, జగన్ కి ప్రజల ప్రాణాల పట్ల అసలు బాధ్యత కూడా లేదని టీడీపీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణాలో పరిస్థితి అద్వానంగా ఉంది. అక్కడ కేసుల లెక్కలలో పారదర్శకత లేదని, ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని, గవర్నర్ మరియు న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. కరోనా సంక్లిష్ట సమయంలో రెండు వారాలు సీఎం కేసీఆర్ కనిపించకుండా పోయారు. మరి ఈ విషయాలపై టీడీపీ ఎందుకు మాట్లాడడం లేదో పార్టీ నేతలకే తెలియాలి. ఏపీ ప్రజల పట్ల ఉన్న భాద్యత, తెలంగాణా ప్రజల పట్ల టీడీపీకి లేదా అనేది చెప్పాలి. లేక కెసిఆర్ ని విమర్శించడానికి బాబు భయపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.