https://oktelugu.com/

జగన్ తో ఫైట్.. నిమ్మగడ్డే గెలిచాడు!

నిమ్మగడ్డ వర్సెస్ సీఎం జగన్ పోరులో చిట్టచివరికి నిమ్మగడ్డే గెలిచాడు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా.. చివరకు గవర్నర్ వద్దకు చేరిన పంచాయితీలో నిమ్మగడ్డ ఎక్కని గడప లేదు.. తొక్కని వాకిలి లేదు. హైదరాబాద్ లో బీజేపీనేతలతో సంప్రదింపులు జరిపారు. పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం జగన్ కాదంటున్నా ఫైట్ చేశారు. చివరకు ఆయనకు ఇష్టం లేకున్నా ఏపీ ఎన్నికల కమిషనర్ గా గవర్నర్ సాయంతో నియామకం కావడానికి రెడీ అయ్యారు. ఏపీ సీఎం జగన్ ధాటికి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 22, 2020 / 02:47 PM IST
    Follow us on


    నిమ్మగడ్డ వర్సెస్ సీఎం జగన్ పోరులో చిట్టచివరికి నిమ్మగడ్డే గెలిచాడు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా.. చివరకు గవర్నర్ వద్దకు చేరిన పంచాయితీలో నిమ్మగడ్డ ఎక్కని గడప లేదు.. తొక్కని వాకిలి లేదు. హైదరాబాద్ లో బీజేపీనేతలతో సంప్రదింపులు జరిపారు. పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం జగన్ కాదంటున్నా ఫైట్ చేశారు. చివరకు ఆయనకు ఇష్టం లేకున్నా ఏపీ ఎన్నికల కమిషనర్ గా గవర్నర్ సాయంతో నియామకం కావడానికి రెడీ అయ్యారు.

    ఏపీ సీఎం జగన్ ధాటికి టీడీపీ కూసాలు కదిలిపోతున్నాయి. మాజీ టీడీపీ మంత్రులు జైలు పాలు అవుతున్నారు. జగన్ ను తిట్టిన వారు జైలుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తో పేచీ ఎందుకని చాలామంది టీడీపీ మాజీ మంత్రులు అజ్ఞాతవాసం గడుపుతూ రాజకీయాల్లో అస్సలు యాక్టివ్ లేరు. మొన్నటివరకు జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా విమర్శించే దేవినేని ఉమ కూడా సైలెంట్ అయ్యారు. జగన్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టుల అవకతవకలపై విచారణ చేస్తుండడంతో ఆయన కూడా మౌనం దాల్చారు.

    Also Read: కోవిడ్ బారిన పడిన విజయసాయి..

    ఇలా అందరూ భీకర మెజార్టీతో గద్దెనెక్కి అధికార బలంతో చెలరేగిపోతున్న జగన్ ధాటికి కిక్కురుమనకుండా ఉంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎదురు నిలిచి న్యాయస్థానాల ద్వారా పోరాడి గెలిచాడు. చంద్రబాబు నియమించిన ఆయన సామాజికవర్గానికే చెందిన నిమ్మగడ్డకు తాజాగా సుధీర్ఘ పోరాటం తర్వాత ఊరట లభించింది.

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలంటూ గవర్నర్ హరిచందన్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ రాశారు. మే 29నాటి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

    హైకోర్టు ఆదేశానుసారం.. తనను ఏపీ ప్రభుత్వం తిరిగి ఎస్ఈసీగా నియమించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్.. ఇటీవలే గవర్నర్ ను కలిసి విన్నవించుకున్నారు. తాజాగా ఈరోజు ఆయనను అపాయింట్ చేయాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

    Also Read: ఆ ముక్క ముందు మోడీని కదా అడగాల్సింది బాబు..!

    ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను పలు ఆర్డినెన్స్ లు తెచ్చి తొలగించారు.మరో ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ సర్కార్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు కూడా నిమ్మగడ్డకే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా కూడా హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో తాజాగా గవర్నర్ ను కలిసి విన్నవించాలని నిమ్మగడ్డకు హైకోర్టు సూచించింది. గవర్నర్ కూడా నిమ్మగడ్డ వెంటే నిలవడంతో ఇప్పుడు జగన్ ఏం చేస్తాడన్నది ఉత్కంఠగా మారింది. నిమ్మగడ్డను నియమించక తప్పని పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు.

    కాగా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎంతో బలవంతుడైన జగన్ ను ఎదుర్కొని ఒక రిటైర్డ్ ఐఏఎస్.. అదీ చంద్రబాబు అనుకూలవాదిగా పేరొందిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గెలిచాడనే చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వంలో టీడీపీ నియమించిన వ్యక్తి నిమ్మగడ్డ మున్ముందు ఎలా వ్యవహరిస్తాడన్నది ఆసక్తిగా మారింది. వీరిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్ రంజుగా ఉండనుంది.

    -ఎన్నం