Telangana TDP: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరని తెలిసిందే. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం కావాలని భావిస్తున్నారు. గతంలో రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాల కారణంగా రెండు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా మళ్లీ టీడీపీని తీసుకురావాలని చూస్తున్నారు. దీనికోసం టీటీడీపీ నేతల మధ్య సమాలోచనలు సాగుతున్నాయి.

తెలంగాణలో టీడీపీకి పట్టున్న ప్రాంతాలు ఇంకా ఉన్నాయని నేతల అభిప్రాయం. దీంతో ఇక్కడ తమ ప్రభావం చూపాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు .సభ్యత్వ నమోదు చేపట్టాలని భావిస్తున్నారు. దీని కోసం కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేస్తున్నారు.
Also Read: Sensational Tollywood Combination: సెన్సేషనల్ కాంబినేషన్ కి సర్వం సిద్ధం.. RRR రికార్డ్స్ అవుట్
తెలంగాణలో సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇవ్వనున్నారు. దీంతో సభ్యత్వ నమోదుపై నేతలు కార్యకర్తల్లో అవగాహన కల్పించనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో టీఆర్ఎస్ తీసుకొచ్చిన ప్రమాద బీమాను టీడీపీ కూడా ఇస్తుందని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో పార్టీకి ఉనికి కరువైన సందర్భంలో ప్రస్తుతం చంద్రబాబు చేపడుతున్న విధానాలతో ఇక్కడ పార్టీ మనగలుగుతుందా? పోటీని తట్టుకోగలుగుతుందా? మరోవైపు బీజేపీనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా వస్తున్న క్రమంలో టీడీపీని ప్రజలు విశ్వసిస్తారా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. తెలంగాణలో తాను చేసిన అభివృద్ధి వల్లే సుభిక్షంగా ఉందని చంద్రబాబు చెబుతున్నారు.
Also Read:AP New Ministers Controversies: కొత్త అమాత్యుల చుట్టూ వివాదాలు.. విజయ యాత్రలతో ప్రజలకు సిగపాట్లు
[…] Congress- TRS: దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ లేకుండా ఏ కూటమీ సాధ్యం కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ బీజేపీకి వ్యతిరేక పార్టీలను ఒక్కటి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, టీఆర్‌ఎస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఆయన కాంగ్రెస్‌తో కలిస్తేనే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించగలమన్న అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన పీకే తాజాగా ఆ పార్టీకి దగ్గరవుతున్నారు. అవసరమైతే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు బీజేపీ ఉమ్మడి శత్రువు అయినందున పీకే చొరవతో ఈ పార్టీలు మిత్రులవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. […]