Homeఎంటర్టైన్మెంట్KGF 2 3 Days Collections: KGF chapter2 3 రోజుల వసూళ్లు

KGF 2 3 Days Collections: KGF chapter2 3 రోజుల వసూళ్లు

KGF 2 3 Days Collections: ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం KGF చాప్టర్ 2 మేనియా ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఒక్క కన్నడ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఈ స్థాయిలో శాసిస్తుంది అని..#RRR మరియు బాహుబలి పార్ట్ 2 వంటి సినిమాల వసూళ్లకు కూడా సవాలు విసురుతుంది అని కలలో కూడా ఎవ్వరు బహుశా ఊహించి ఉండకపోవచ్చు..కానీ నేడు ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే మళ్ళీ ఇలాంటి వసూళ్లను చూడగలమా అని అనిపిస్తుంది..ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకి వస్తున్నా వసూళ్లు చూసి అక్కడి ట్రేడ్ పండితులకు సైతం మతి పోతుంది..ఫుల్ రన్ లో కేవలం 42 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసిన ఒక్క సినిమాకి సీక్వెల్ అయినా ఈ మూవీ కి ఇంత క్రేజా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు ..ఒక్క హిందీ లో మాత్రమే కాదు తెలుగు , తమిళం మరియు కన్నడ బాషలలో కూడా ఈ సినిమా సృష్టించే ప్రభంజనం చూసి ట్రేడ్ పండితులు సైతం మెంటలెక్కిపోతున్నారు..మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

KGF 2 3 Days Collections
KGF 2 3 Days Collections

 

బాలీవుడ్ లో ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 52 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి ఆల్ టైం డే 1 రికార్డు గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..ఇక రెండవ రోజు కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా ఈ సినిమా అక్కడ దాదాపుగా 48 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసిన ఏకైక హిందీ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక మూడవ రోజు కూడా ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద చెలరేగిపోయింది..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మూడవ రోజు కూడా 45 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసినట్టు తెలుస్తుంది..అంటే మూడు రోజులకు గాను కేవలం బాలీవుడ్ నుండే ఈ సినిమా 145 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి సరికొత్త ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఇక తెలుగు లో కూడా ఇక్కడ ఈ సినిమా మన స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్ వసూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా వసూళ్లను రాబడుతుంది.

Also Read: KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు 19 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం..రెండవ రోజు 13 కోట్ల 33 లక్షల రూపాయిలు, అలాగే మూడవ రోజు 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి కేవలం మూడు రోజుల్లో 45 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఏకైక డబ్ చిత్రం గా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక కర్ణాటక ప్రాంతం లో కూడా ఈ సినిమా 43 కోట్ల రూపాయిల వసూలు చేసి ఆల్ టైం రికార్డు ని సృష్టించింది..ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఒక్క కన్నడ సినిమాకి కన్నడ భాషలో కంటే తెలుగు లో ఎక్కువ రావడం..

KGF 2 3 Days Collections
KGF 2 3 Days Collections

ఇదంతా చూస్తూ ఉంటె మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఒక్క సినిమాని ఆదరిస్తే ఎంతలా నెత్తిన పెట్టుకొని తిరుగుతారో అర్థం చేసుకోవచ్చు..ఇక తమిళ నాడు లో అక్కడి సూపర్ స్టార్ విజయ్ కొత్త సినిమా బీస్ట్ వసూళ్లను కూడా అధిగమించి అక్కడ మూడు రోజులకు గాను దాదాపుగా 15 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషలకు కలిపి దాదాపుగా 190 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది..భవిష్యత్తులో ఈ ఇదే ఊపు ని మాత్రం కొనసాగిస్తే ఒక్క #RRR ని మాత్రమే కాదు బాహుబలి పార్ట్ 2 సినిమాని కూడా దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..మరి చూడాలి ఈ సినిమా ఫుల్ రన్ లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో.

Also Read: KGF2 : బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సౌత్ ఇండియా.. కేజీఎఫ్ హిట్ అయితే ఖతమే!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

  1. […] Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అభిమానుల ముందుకి సర్కారు వారి పాట అనే సినిమా తో వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై కేవలం అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..పైగా ఈ సినిమా దర్శకుడు పరశురామ్ పెట్ల గీత గోవిందం అనే సినిమా తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు..ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..అలాంటి హిట్ సినిమా తర్వాత ఒక్క స్టార్ హీరో తో చేస్తున్న సినిమా కావడం తో ట్రేడ్ లో కూడా ఈ సినిమా బిజినెస్ ఫుల్ స్వింగ్ లో సాగుతుంది..ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదల అయినా రెండు పాటలు మరియు టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం కూడా ఈ సినిమా పై క్రేజ్ పెరగడానికి కారణం అయ్యింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular