YS Jagan New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తాజాగా ఏపీ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, ఈ జిల్లాల ఏర్పాటును కొంత మంది ఆహ్వానించారు. కాగా, మరి కొందరు జిల్లాల ఏర్పాటు కష్టమని, జిల్లా కేంద్రంలో మౌలిక వసతుల కల్పన, కార్యాలయాల ఏర్పాటుకు నిధులు అవసరమని అన్నారు. కాగా, తాజాగా ఈ విషయమై ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే టీడీపీ ఎంపీలతో సమావేశమైన బాబు.. పలు విషయాలపైన వారితో చర్చించారు.

జగన్ సర్కారు కావాలని ప్రజల దృష్టి మరల్చేందుకే జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని ఆరోపించారు. ఆర్థిక ఉల్లంఘనలతో ఏపీని అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు. 22 మంది వైసీపీ ఎంపీలు ఉండి జగన్ రాష్ట్రానికి ఏం తెచ్చారని చంద్రబాబు అడిగారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వలన ఏపీకి కలిగిన లాభమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలన అంటే అప్పు చేయడం, దోచుకోవడమే అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని, ఈ క్రమంలోనే ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చేందుకుగాను కొత్త జిల్లాల డ్రామాను మొదలు పెట్టారని ఆరోపించారు.
Also Read: జగన్‌కు కొత్త టెన్షన్.. జిల్లాల ఏర్పాటుతో వైసీపీలో ఇలా జరుగుతుందేంటి..
ఏపీలో ప్రస్తుతం తీవ్రమైన సమస్యలున్నాయని, పీఆర్సీ విషయమై ఓ వైపున ఉద్యోగులు ప్రభుత్వంపై గరం మీద ఉన్నారని, మరో వైపున అధికార పార్టీ అరాచకానికి బాధితులు చాలా మంది ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలోనే జనం దృష్టిని మరల్చి రాజకీయంగా లాభం పొందేందుకుగాను జగన్ ఈ నిర్ణయాన్ని తెర మీదకు తెచ్చారని అన్నారు బాబు. ఇకపోతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కొత్త జిల్లాల ఏర్పాటు వలన ఇంకా నిధుల కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు.
మరో వైపున వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఉగాది లోపు పూర్తి చేయాలని భావిస్తోంది. పరిపాలనా సౌలభ్యం, పాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ అవుతుందని వైసీపీ నేతలు వివరిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై నెల రోజుల్లో అభ్యంతరాలు తెలపాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఏ మేరకు అభ్యంతరాలు వస్తాయనేది చూడాల్సి ఉంటుంది. ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది జగన్ సర్కారు.
Also Read: కొత్త జిల్లాల ఏర్పాటు ఆలస్యమేనా? .. మరో నోటిఫికేషన్ కు సర్కారు నిర్ణయం
[…] OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందనే వార్త మరోసారి చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుందని, అందులో జాన్వీని తీసుకోనున్నట్లు టాక్. పాన్ ఇండియాగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ల గురించి నిర్మాతలు పరిశీలించగా జాన్వీ పేరు చర్చకు వచ్చిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. […]
[…] Also Read: YS Jagan New Districts: జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు వ… […]