విపక్షాల గొంతు కేసీఆర్ నొక్కేస్తున్నారా? సీతక్క ఆవేదన ఇదీ..

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ విపక్షాల గొంతు నొక్కేస్తున్నారా..? రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఆహో.. ఓహో అని గొప్పలు చెప్పుకునేందుకే అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తున్నారా..? రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ స్ర్టాటజీ అంతా వినియోగిస్తున్నారా..? నూతన రెవెన్యూ చట్టంతో పేదలకు ఊరటనిచ్చిన కేసీఆర్‌‌.. ఎల్‌ఆర్‌‌ఎస్‌ భారం ఎందుకు మోపారు..? అసెంబ్లీలో విపక్షాలకు మాట్లాడే అర్హత లేదా..? ప్రతిసారీ వారికి టీఆర్‌‌ఎస్‌ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నట్లు..? ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాలను చూస్తున్న ప్రతిఒక్కరిలోనూ మెదులుతున్న ప్రశ్నలివి. […]

Written By: NARESH, Updated On : September 15, 2020 9:41 am

seetakka in assembly

Follow us on

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ విపక్షాల గొంతు నొక్కేస్తున్నారా..? రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఆహో.. ఓహో అని గొప్పలు చెప్పుకునేందుకే అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తున్నారా..? రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ స్ర్టాటజీ అంతా వినియోగిస్తున్నారా..? నూతన రెవెన్యూ చట్టంతో పేదలకు ఊరటనిచ్చిన కేసీఆర్‌‌.. ఎల్‌ఆర్‌‌ఎస్‌ భారం ఎందుకు మోపారు..? అసెంబ్లీలో విపక్షాలకు మాట్లాడే అర్హత లేదా..? ప్రతిసారీ వారికి టీఆర్‌‌ఎస్‌ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నట్లు..? ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాలను చూస్తున్న ప్రతిఒక్కరిలోనూ మెదులుతున్న ప్రశ్నలివి.

Also Read: మళ్లీ రవి ప్రకాష్‌ చేతికి టీవీ 9..?

సీఎం కేసీఆర్‌‌.. టీఆర్‌‌ఎస్‌ నేతల వైఖరిపై నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ‘మన అసెంబ్లీ ఎదుట చనిపోయిన వ్యక్తికి నివాళి అర్పించలేనంత తీరిక లేకుండా ఉన్నరా..? ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, గౌరవించాలని కోరుతున్నా. అతని పేరే తెలంగాణ నాగులు. అతని డెడ్‌ బాడీ మీద కూడా టీఆర్‌‌ఎస్‌ జెండా ఉంది. మీ వాళ్లు ఎవరూ పోలేదు. ఉద్యమకారులను గౌరవించండి. వాళ్లు ఎందుకు చనిపోతున్నారో.. వాళ్ల డిమాండ్లు ఏమిటో వినండి. ఆహో, ఓహో అని డబ్బా కొట్టుకునేందుకే అసెంబ్లీ నడుపుతున్నరు. ప్రజాసమస్యల ప్రస్తావనకు అవకాశం ఎక్కడ ఇస్తున్నారు’ అంటూ నిలదీశారు.

హోం మినిష్టర్‌‌ వెంటనే చ‌ర్యలు తీసుకోవాల‌న్న సీత‌క్క.. స‌భాముఖంగా నాగులుకు నివాళుల‌ర్పిస్తున్నట్లు చెప్పారు. ఒక్క టీఆర్‌‌ఎస్‌ కార్యకర్త కూడా నాగులు కుటుంబాన్ని పరామర్శించకపోవడం సరైంది కాదని అన్నారు.

Also Read: ఏమైనా కెసిఆర్ కి తిరుగులేదేమో

క‌రోనా వ‌ల్ల అన్ని రంగాలకూ తీవ్ర నష్టం వాటిల్లిందని సీతక్క అన్నారు. త‌క్షణ‌మే ప్రభుత్వం స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పథకాలపై గొప్పలు చెప్పుకోవడం కాదు.. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని చురకలు అంటించారు. రాష్ట్రంలో అన్నీ బాగుంటే .. ఇక అసెంబ్లీ ఎందుక‌ని..అన్నీ డ‌బ్బాలు కొట్టుకోవ‌డానికే టీఆర్ఎస్ నేత‌లు స‌భ స‌మ‌యాన్ని వృథా చేస్తున్నార‌ని ఝలక్‌ ఇచ్చారు.