https://oktelugu.com/

బ్రేకింగ్: చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో భద్రతా సిబ్బందికి స్పల్పగాయాలుకాగా చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Also Read: జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా…? చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కు ఎదురుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 / 07:57 PM IST
    Follow us on

    టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో భద్రతా సిబ్బందికి స్పల్పగాయాలుకాగా చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    Also Read: జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా…?

    చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కు ఎదురుగా ఓ ఆవు సడెన్ గా వచ్చింది. వెంటనే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్ లోని రెండు, మూడుకార్లు ఒకదానికొకటి ఢీకొన్నారు. అయితే చంద్రబాబు సహా ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.

    యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే చంద్రబాబు ఉండటంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే క్వాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో కారు ముందుభాగం దెబ్బతింది. ఈ వాహనంలోని భద్రతా సిబ్బందికి సల్ప గాయాలైనట్లు సమాచారం.

    Also Read: బాబు ఇంత జరిగినా మారలేదా… తిట్టినా ఆ పార్టీనే కావాలా…?

    ఈ ఘటన అనంతరం చంద్రబాబు కాన్వాయ్ యథావిధిగా హైదరాబాద్‌కు పయనమైంది. గతంలోనూ చంద్రబాబుకు ఓ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద గతంలో నక్సలైట్లు బాంబు దాడి చేశారు. ఈ ఘటన నుంచి ఆయన ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు అనిపించుకున్నారు. అప్పట్లో చంద్రబాబుపై వచ్చిన సానుభూతి మాత్రం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన కలిసి రాలేదు. ఈ రెండు కూడా కారు ప్రమాదాలే కావడం గమనార్హం. తాజాగా చంద్రబాబు మరోసారి కారు ప్రమాదం నుంచి తప్పించుకోవడంపై టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.